ప్రెగ్నెన్సీ వార్త తర్వాత మొదటి సారి కెమెరా ముందుకు వచ్చిన రామ్ చరణ్, ఉపాసన
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ప్రస్తుతం థాయ్ లాండ్ లో వెకేషన్ లో ఉన్నారు. ఈ మేరకు విహారాన్ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. దాంతో రామ్ చరణ్ అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే ఇటీవలే మెగా కుటుంబం నుండి సంతోషకరమైన వార్త వచ్చింది. రామ్ చరణ్, ఉపాసనలు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి అందరితో పంచుకున్నారు. దీంతో అటు అభిమానుల నుండి, ఇటు సినిమా వాళ్ళ నుండి అభినందన జల్లులు కురిసాయి. మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, ఉపాసనకు కంగ్రాట్స్ చెబుతూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఇలా చాలా మంది సెలెబ్రిటీలు తమ ఆనందాన్ని పంచుకున్నారు.
థాయ్ లాండ్ లో విహారం
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత శంకర్ సినిమాతో బిజీగా గడిపాడు రామ్ చరణ్. ప్రస్తుతం కమల్ హాసన్ తో ఇండియన్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు శంకర్. సో ప్రస్తుతానికి రామ్ చరణ్ కి ఖాళీ దొరికింది. ఆ ఖాళీని విహారంతో నింపుతున్నాడు రామ్ చరణ్. సోషల్ మీడియాలో విడుదలైన ఫోటోల్లో ఎరుపు రంగు డ్రెస్ లో ఉపాసన కనిపిస్తే, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ట్రెండీగా ఉన్నాడు రామ్ చరణ్. ఫ్రెండ్స్ తో పాటు థాయ్ లాండ్ వెకేషన్ కి వెళ్ళినట్లు ఉపాసన షేర్ చేసిన ఫోటోలను చూస్తే తెలుస్తుంది. మొత్తానికి వచ్చే సంవత్సరం తల్లిదండ్రులు అవబోతున్న రామ్ చరణ్, ఉపాసనలు హ్యాపీ వెకేషన్ లో ఉన్నారు.