Seshu Passes Away: లొల్లు సభ ఫేమ్.. శేషు కన్నుమూత
తమిళ సినీ హాస్యనటుడు శేషు మంగళవారం గుండెపోటుతో చికిత్సకు స్పందించలేక కన్నుమూశారు. అయన వయస్సు 60. ఆయనకు ముగ్గురు కొడుకులు. శేషు తీవ్ర గుండెపోటుతో గత కొన్ని రోజులుగా ఆళ్వార్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అప్పటి నుంచి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో రేపు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విజయ్ టీవీ ఛానెల్‌లో ప్రసారమైన 'లొల్లు సభ' షో ద్వారా ఫేమస్ శేషు ఫేమస్ అయ్యారు. సుమారు ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించిన శేషు, కరోనా సమయంలో చాలా మందికి సహాయం చేశారు.
గుండెపోటుతో కన్నుమూసిన హాస్యనటుడు
https://t.co/VKDwTlcB5l Lollu Sabha Fame Comedian Seshu Passes Away Due To Ill Health#seshu #LolluSabha #LolluSabhaSeshu #RIPSeshu #comedian— NewsBricks (@NewsBricks) March 26, 2024