LOADING...
This week Telugu Movies: ఈ వారం థియేటర్లలో సందడి.. ఏప్రిల్‌ తొలి వారంలో రానున్న సినిమాలివే!
ఈ వారం థియేటర్లలో సందడి.. ఏప్రిల్‌ తొలి వారంలో రానున్న సినిమాలివే!

This week Telugu Movies: ఈ వారం థియేటర్లలో సందడి.. ఏప్రిల్‌ తొలి వారంలో రానున్న సినిమాలివే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 30, 2026
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ సినీ ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని విధంగా ఒక విభిన్నమైన కథతో వస్తున్న సినిమా ఇదని హీరో శర్వానంద్ పేర్కొన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'బైకర్' (Biker)పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాలవిక నాయర్ కథానాయికగా నటించగా, సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలను బట్టి చూస్తే, ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త స్పోర్ట్స్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిందని అర్థమవుతోంది.

వివరాలు

చందమామ కథలా 'రాకాస'

ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ అంశాల మేళవింపుతో రూపొందిన 'రాకాస' చిత్రం కూడా ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైంది. ఇది పూర్తిగా ఫిక్షనల్ కథతో, చందమామ కథలా సాగుతుందని చిత్రబృందం చెబుతోంది. మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సరిక ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాతగా నిహారిక వ్యవహరించగా, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.

వివరాలు

మధ్యతరగతి భావోద్వేగాల కథ 'కార్మేని సెల్వం'

మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబించే కథాంశంతో రూపొందిన చిత్రం 'కార్మేని సెల్వం'. ఇందులో సముద్రకని, గౌతమ్ వాసుదేవ్ మేనన్, లక్ష్మి ప్రియా, అభినయ ప్రధాన పాత్రల్లో నటించారు. రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణ్ రంగరాజులు నిర్మించారు. కార్తిక్ కుమార్, కరణ్ చక్రవర్తి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ప్రచారాన్ని బట్టి చూస్తే, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా ఉండే భావోద్వేగ కథగా ఇది తెరకెక్కినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు

యాక్షన్ థ్రిల్లర్‌గా 'లీడర్'

వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన అరుల్ శరవణన్ 'ది లెజెండ్' చిత్రం ద్వారా నటుడిగా మారిన సంగతి తెలిసిందే. 'లెజెండ్ శరవణన్'గా గుర్తింపు పొందిన ఆయన తాజా చిత్రం 'లీడర్'. దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. ఈ చిత్రం కూడా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తంగా, ఏప్రిల్ 3న పలు విభిన్న జానర్లలో సినిమాలు విడుదలవుతుండగా, ప్రేక్షకులకు వినోదభరితమైన వీకెండ్‌ను అందించనున్నాయి.

Advertisement

వివరాలు

ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించే చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌ సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని (తెలుగు) ఏప్రిల్‌ 3 హ్యాపీ పటేల్‌ (హిందీ) ఏప్రిల్‌ 1 జీ5 హే బలవంత్‌ (తెలుగు మూవీ) మార్చి 31 భాబీజీ ఘర్‌ పర్‌ హై (హిందీ) ఏప్రిల్‌ 3 అమెజాన్‌ ప్రైమ్‌ మా కసమ్‌ (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 3

Advertisement