Prakash Raj: ప్రకాశ్ రాజ్ ఇంట విషాదం.. తల్లి సువర్ణలత కన్నుమూత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 30, 2026
10:46 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సువర్ణలత, నేడు ఉదయం స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సువర్ణలత అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం బెంగళూర్‌లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆమె మృతి పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తూ, మాతృవియోగంతో కృంగిపోయిన ప్రకాశ్ రాజ్‌కు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. తల్లి మరణంతో ప్రకాశ్ రాజ్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.