NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులు, సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ   
    తదుపరి వార్తా కథనం
    జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులు, సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ   
    సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ

    జీ తెలుగు ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా గణేష్ నవరాత్రులు, సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం తయారీ   

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 20, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'గణపతిబప్పా.. మోరియా' అంటూ దేశమంతటా ఘనంగా జరుపుకొనే పండుగ 'గణేష్​ చతుర్థి'. వీధివీధినా మండపాలు ఏర్పాటు చేసి గణపతి నవరాత్రులను కోలాహలంగా నిర్వహిస్తారు.

    కుటుంబమంతా కలిసి జరుపుకొనే ఈ వేడుకను జీ తెలుగు మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు సిద్ధమైంది. పాశ్చత్య పోకడలకు భిన్నంగా పర్యావరణ హితమైన గణేష్​ విగ్రహ ఏర్పాటుతో పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది.

    జీ తెలుగు ఆధ్వర్యంలో 100% పర్యావరణ హితమైన గణేష్​ విగ్రహాన్ని ఏర్పాటుచేసి గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించనున్నారు.

    వినాయక చవితి పర్వదినాన శ్రీ సాయిహైట్స్, యూఎంసీసీరోడ్డు, నవోదయకాలనీ, కూకట్​పల్లి, హైదరాబాద్-72 చిరునామాలో ఎకోఫ్రెండ్లీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు.

    Details

    పూజలు నిర్వహించే జీ తెలుగు నటీనటులు 

    పర్యావరణ సంరక్షణలో భాగంగా జీ తెలుగు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గణేష్​ మండపం ప్రత్యేకతను సంతరించుకుంది.

    ఈ మండపంలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహం జీరో వేస్ట్​ కాన్సెప్ట్​తో పూర్తిగా పునర్వినియోగ వస్తువులతో నిర్మించబడింది.'

    ఆరంభం ఒక్క అడుగుతోనే' అంటూ ప్రతిక్షణం స్ఫూర్తి నింపే జీ తెలుగు, పర్యావరణ రక్షణలోనూ మొదటి అడుగు వేసింది.

    ఈ వినాయక విగ్రహాన్ని తయారుచేయడానికిజీ తెలుగులో ప్రసారమయ్యే కార్యక్రమాలను తెరకెక్కించడానికి వినియోగించే పరికరాలను ఉపయోగించారు.

    ఈ మండపంలో జీ తెలుగు నటీనటులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పర్యావరణ హితమైన వినాయక విగ్రహాన్ని భక్తులుకూడా దర్శించుకోవచ్చు.

    Details

    సెట్ ప్రాపర్టీస్ తో గణపతి విగ్రహం 

    పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఈ వినాయక విగ్రహాన్ని పూర్తిగా సెట్ ప్రాపర్టీస్ నుండి రూపొందించారు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్​ 18న ప్రతిష్టించిన ఈ విగ్రహాన్ని 11రోజులు సందర్శకులు దర్శించవచ్చు.

    ఈ విగ్రహాన్ని రూపొందిచడానికి మైక్రోఫోన్లు, స్పీకర్లు, లైట్లు, లెడ్ కేబుల్, సౌండ్ స్పీకర్ బబుల్స్, మైక్, LED లైట్ రిమోట్, చెవుల్లో లైట్లు, వేళ్లలో కెమెరా వస్తువులు, అరచేతుల్లో లైట్ హోల్డర్లు మొదలగు సెట్ ప్రాపర్టీస్ వాడారు.

    పర్యావరణానికి హాని కలిగించకూడదనే సదుద్దేశంతో రూపొందించిన ఈ గణపతి విగ్రహాన్ని జాగ్రత్తగా విచ్ఛిన్నం చేసి ఆయా పరికరాలను తిరిగి సెట్స్​కి పంపిస్తారు. ప

    ర్యావరణ సంరక్షణలో భాగంగా జీ తెలుగు ప్రారంభించిన ఈ ప్రయాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జీ తెలుగు కోరుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెలివిజన్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    టెలివిజన్

    బిగ్ బాస్ తెలుగు: విజయ్ తప్పుకుంటున్నాడు, బాలకృష్ణను పట్టుకోవాల్సిందేనా మా టివి
    టీవీల్లోకి వస్తున్న ఉప్పెన హీరోయిన్ కొత్త సినిమా తెలుగు సినిమా
    టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న కార్తీ నటించిన సర్దార్ సినిమా
    Happy Brthday Suma Kanakala: యాంకరింగ్‌కు బ్రాండ్ ఇమేజ్ 'సుమ కనకాల' తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025