LOADING...
APEPDCL: విద్యుత్‌ ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు.. ఏపీఈపీడీసీఎల్‌ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు
ఏపీఈపీడీసీఎల్‌ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు

APEPDCL: విద్యుత్‌ ప్రమాదాలపై ముందస్తు హెచ్చరికలు.. ఏపీఈపీడీసీఎల్‌ ఏఐ టెక్నాలజీ ప్రత్యేకతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2026
09:38 am

ఈ వార్తాకథనం ఏంటి

విద్యుత్‌ ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు రాష్ట్ర తూర్పు విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) ఆధునిక ఏఐ ఆధారిత తనిఖీ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యుత్‌ లైన్లు, స్తంభాలు, క్రాస్‌ఆర్మ్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవడం, ఒరిగే ప్రమాదం ఉన్న స్తంభాలను ముందే గుర్తించడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థ కోసం లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్‌ (ఎల్‌ఎల్‌ఎం) పద్ధతిలో పనిచేసే ప్రత్యేక ఏఐ యాప్‌ను రూపొందించారు. ఏపీఈపీడీసీఎల్‌ ఐటీ ఇంజినీర్లు, ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ సంస్థ కలిసి ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని అమలు చేసిన తొలి డిస్కం‌గా ఏపీఈపీడీసీఎల్‌ నిలిచిందని అధికారులు చెబుతున్నారు.

వివరాలు 

ప్రమాద తీవ్రత అంచనా ఇలా..

డిస్కం పరిధిలోని మొత్తం విద్యుత్‌ నెట్‌వర్క్‌ను ఇప్పటికే జియోగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌)తో అనుసంధానించారు. సిబ్బంది స్మార్ట్‌ఫోన్‌తో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెలు, క్రాస్‌ఆర్మ్‌ల ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. అవి వెంటనే సర్వర్‌కు చేరతాయి. ఏఐ టెక్నాలజీ ఆ ఫొటోలను పరిశీలించి: స్తంభం ఒరిగిందా? ప్రమాద తీవ్రత ఎంత? ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మె ఎత్తు సరైనదా? ప్రమాదం సంభవించే అవకాశముందా? క్రాస్‌ఆర్మ్‌ దెబ్బతిందా? అనే అంశాలను ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఫలితాల ఆధారంగా ప్రమాదాన్ని: హై రిస్క్ మీడియం రిస్క్ లో రిస్క్ అని వర్గీకరిస్తుంది. దీని ప్రకారం సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమస్య పరిష్కరించిన తరువాత కూడా ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం అంతా ఉన్నతాధికారులకు వెంటనే అందుతుంది.

వివరాలు 

యాప్‌ పనిచేసే విధానం

ఫీల్డ్‌లో పరిస్థితిని స్మార్ట్‌ఫోన్‌తో ఫొటో తీస్తారు స్తంభం, ట్రాన్స్‌ఫార్మర్‌ వంటి వాటి ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు ఫొటో క్లారిటీ తక్కువగా ఉన్నా లేదా సరైన యాంగిల్‌లో తీసుకోకపోయినా యాప్‌ స్వయంగా సరిచేసుకుని విశ్లేషిస్తుంది

Advertisement

వివరాలు 

ఏఐ విశ్లేషణలో కచ్చితత్వం

వంగిన స్తంభాలు, క్రాస్‌ఆర్మ్ సమస్యలను 89% కచ్చితత్వంతో గుర్తింపు ఇన్సులేటర్ల ఆధారంగా వోల్టేజ్ స్థాయిలను 93% ఖచ్చితత్వంతో అంచనా ట్రాన్స్‌ఫార్మర్‌-భూమి మధ్య దూరాన్ని 92% ఖచ్చితత్వంతో గుర్తింపు తీగలకు తగిలే చెట్ల ప్రమాదాన్ని 80% ఖచ్చితత్వంతో అంచనా క్షేత్రస్థాయిలో సేకరించిన 10,000 ఫొటోల ఆధారంగా ఈ విశ్లేషణ జరిగింది. పైలట్‌ ప్రాజెక్ట్‌లో: పైలట్‌ ప్రాజెక్టు కింద 8 ఫీడర్ల పరిధిలోని 7,362 స్తంభాలు, 807 లొకేషన్లలో తీగలకు తగిలేలా ఉన్న చెట్లు, 423 క్రాస్‌ఆర్మ్‌.. తదితర ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. వాటిలో 2,329 లోపాలను యాప్‌ గుర్తించింది.

Advertisement

వివరాలు 

యాప్‌ ఉపయోగాలు ఏమిటి?

మానవ తప్పిదాలకు తావు ఉండదు అంచనాల్లో పొరపాట్లు తగ్గుతాయి సమస్య పరిష్కారంలో ఆలస్యం ఉండదు సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేదాకా యాప్‌లో పెండింగ్‌గా కనిపిస్తుంది సిబ్బంది నిర్లక్ష్యానికి అవకాశం ఉండదు సమస్య ఉన్న ప్రదేశాన్ని వెంటనే గుర్తించవచ్చు జీఐఎస్‌ ద్వారా లొకేషన్ ట్రాకింగ్ సులభం డ్రోన్‌ తనిఖీల కంటే ఎక్కువ కచ్చితత్వంతో విశ్లేషణ ఈ టెక్నాలజీ వినియోగం కోసం ప్రత్యేక సర్వర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అదనపు స్మార్ట్‌ ఫీచర్లు లో వోల్టేజ్‌ ప్రాంతాలను ముందుగానే గుర్తించేందుకు లోడ్‌ విశ్లేషణ గ్రాఫ్‌లు ఫీడర్ల వారీగా ట్రాన్స్‌ఫార్మర్లపై పడే లోడ్‌ అంచనా ఓవర్‌లోడ్‌ ఉన్న ప్రాంతాల గుర్తింపు

Advertisement