Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ కు ప్రమాదం.. కాపాడిన BSF
దక్షిణ కశ్మీర్‌లోని పహల్‌గామ్‌లోని చందన్‌వారి ప్రాంతంలోని గుహ మందిరానికి వెళుతున్న అమర్‌నాథ్ యాత్రికులతో కూడిన వ్యాన్ ఆదివారం ప్రమాదానికి గురైంది. శ్రీ అమర్‌నాథ్ జీ యాత్రికులు ప్రయాణిస్తున్న వ్యాన్ చందన్వారి సమీపంలో ప్రమాదానికి గురై కొంతమంది యాత్రికుల తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని BSF సత్వర స్పందన బృందాలు(QRT) సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.తమ బృందాలు BSF యాత్రికుల విలువైన ప్రాణాలను కాపాడాయని BSF తెలిపింది.
అమర్‌నాథ్ యాత్రను పూర్తి చేసిన 13,000 మంది యాత్రికులు
52 రోజుల పాటు జరిగే వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న రక్షా బంధన్ , శ్రావణ పూర్ణిమ పండుగలతో ముగుస్తుంది. ఇప్పటివరకు 13,000 మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్ర చేశారు. కాశ్మీర్ హిమాలయాలలో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గుహ మందిరానికి చేరుకోవడానికి యాత్రికులు సంప్రదాయ 48-కిమీ పొడవున్న దక్షిణ కాశ్మీర్ నున్వాన్ (పహల్గామ్) బేస్ క్యాంప్ మార్గం ద్వారా ప్రయాణిస్తారు. కాగా ఉత్తర కాశ్మీర్ బల్తాల్ బేస్ క్యాంప్ మార్గాన్ని కూడా ఉపయోగిస్తారు.