AP Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 05, 2026
01:24 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది అసెంబ్లీ పనితీరును ప్రత్యక్షంగా చూడటం ద్వారా విద్యార్థులకు శాసన వ్యవస్థ ప్రాధాన్యం గురించి అవగాహన పెరగాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ బుధవారం తెలిపారు. విద్యార్థుల ఆసక్తి మేరకు వారి పేర్లతో పాటు ఆధార్ సంఖ్యలతో కూడిన జాబితాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతకం చేసి, స్టాంప్ చేయడం తప్పనిసరి అని సూచించారు. ఈ జాబితాలను legis.passes@gmail.com కు మెయిల్ చేయాలని, మరిన్ని వివరాలకు 86324 49184, 86324 49185 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.