Loading...
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక
బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక

BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా కార్యాచరణను ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రంలోని బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులను అధ్యయనం చేసి రిజర్వేషన్లను నిర్ణయించేందుకు నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ ఇప్పటికే తన కసరత్తును తుది దశకు తీసుకొచ్చింది. ఆగస్టు 14న నివేదిక విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌మిశ్రా అధ్యక్షతన ఏర్పాటు చేసిన డెడికేటెడ్‌ కమిషన్‌.. రాష్ట్రంలో బీసీల పరిస్థితిపై అధ్యయనం పూర్తి చేసి ఆగస్టు 14న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. నివేదికను సిద్ధం చేసే ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

సిఫార్సుల కోసం ప్రత్యేక కమిషన్

డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక అందిన వెంటనే రిజర్వేషన్లపై తదుపరి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

నివేదికలోని అంశాలను పరిశీలించి సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని లేదా ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ వ్యవస్థ ఇచ్చే సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.

కేబినెట్‌ ఆమోదం తర్వాత బిల్లు

సిఫార్సులు అందిన అనంతరం మొత్తం నివేదికను మంత్రిమండలి ముందు ఉంచి ఆమోదం పొందేలా చర్యలు తీసుకోనున్నారు.

కేబినెట్‌ ఆమోదం లభించిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనను బిల్లు రూపంలో రూపొందించనున్నారు.

వివరాలు 

అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేసే దిశగా..

ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

బిల్లుపై చర్చ జరిగిన అనంతరం రెండు సభల ఆమోదం పొందేలా ప్రక్రియ కొనసాగనుంది. ఆమోదం అనంతరం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించనున్నారు.

కేంద్రానికి కూడా నివేదిక

రిజర్వేషన్లకు సంబంధించి చట్టం చేసిన తర్వాత దానిని కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మొత్తం ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

వారం రోజుల్లోనే పూర్తి చేసేలా కసరత్తు

డెడికేటెడ్‌ కమిషన్‌ ఆగస్టు 14న నివేదిక సమర్పించిన తర్వాత కేవలం వారం రోజుల్లోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.

కమిషన్‌ నివేదిక నుంచి సిఫార్సులు, మంత్రివర్గ ఆమోదం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఆమోదం పొంది చట్టంగా మార్చే వరకు చర్యలను వేగంగా చేపట్టనున్నారు.

ADVERTISEMENT