
Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ యాత్రలో భాగంగా ఫిబ్రవరి 26 అర్థరాత్రి తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది.
ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పూర్నియాలోని బిలౌరీ పనోరమా హైట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
తేజస్వి యాదవ్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కారు అదుపు తప్పి డివైడర్‌ను ధ్వంసం చేసి.. అవతలి లేన్‌లో ఉన్న కారును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో అవతివైపు కారులో కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం GMCHలో చేర్పించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
#WATCH | Purnea, Bihar: One of our escort cars met with an accident under the Mufassil police station area. The driver of the car died on the spot and the remaining 6 police officials were injured in the accident. They are being treated in GMCH Hospital. Further investigation is… pic.twitter.com/frUWFuAlrJ
— ANI (@ANI) February 27, 2024