
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డి.. బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్
ఈ వార్తాకథనం ఏంటి
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గం అభ్యర్థిగా వీ.సునీతా లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన బీఆర్‌ఎస్ కోర్ కమిటీ ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయించింది.
అనంతరం ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మదన్‌రెడ్డి సమక్షంలో సునీత లక్ష్మారెడ్డికి కేసీఆర్ బీ-ఫారం అందజేశారు.
ప్రస్తుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా సీహెచ్ మదన్ రెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు మెదక్ పార్లమెంట్ సీటును ఖారారు చేసిన కేసీఆర్.. ఆయన సిట్టింగ్ స్థానాన్ని సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారు.
ప్రస్తుతం మెదక్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నుంచి అసెంబ్లీ బరిలో దిగుతున్న విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీఫామ్ అందజేస్తున్న కేసీఆర్
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి గారిని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు.ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
— BRS Party (@BRSparty) October 25, 2023
అదే సందర్భంగా ప్రస్థుతం నర్సాపూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మదన్ రెడ్డి కి రాబోయే… pic.twitter.com/hEFRoaX6hg