Page Loader
Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు
డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు

Andhra pradesh: డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌.. తొలి విడతగా లక్ష గృహాలపై ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వం ప్రజలపై విద్యుత్‌ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో, కేంద్ర ప్రాయోజిత పథకం "పీఎం సూర్యఘర్‌ యోజన" కింద ప్రతి ఇంటిని సోలార్‌ విద్యుత్ వినియోగానికి అనుసంధానం చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా డ్వాక్రా మహిళలు ఉన్నందున, ఈ పథకాన్ని వారితో అంచెలంచెలుగా విస్తృతపరచాలని నిర్ణయించింది.

వివరాలు 

సోలార్‌ రూఫ్‌టాప్‌ల అమరిక 

తొలి విడతలో లక్ష మంది డ్వాక్రా మహిళల ఇళ్లపై సోలార్‌ రూఫ్‌టాప్‌ అమర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ప్రయోజనాలపై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌) అధికారులు డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అంగీకరించిన వారికి ఈ సేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 80 వేల మంది ఈ పథకానికి తమ సమ్మతిని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 700 ఇళ్లపై సోలార్‌ ప్యానళ్లు అమర్చగా, అందులో 400 గృహాలు డ్వాక్రా మహిళలవే. ఇతర జిల్లాల్లో కూడా సోలార్‌ ప్యానళ్ల ఇన్‌స్టాలేషన్‌ కొనసాగుతోంది.

వివరాలు 

రాయితీ వివరణ 

పీఎం సూర్యఘర్‌ యోజన కేవలం గృహ వినియోగదారులకు వర్తిస్తుంది. ఇందులో 3 రకాల సామర్థ్యంతో సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రాయితీలు అందుబాటులో ఉన్నాయి: 3 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రూఫ్‌టాప్‌ ఏర్పాటు ఖర్చు రూ.1.95 లక్షలు కాగా, ప్రభుత్వం అందించే రాయితీ రూ.78 వేలు. 2 కిలోవాట్ల వ్యవస్థకు ఖర్చు రూ.1.40 లక్షలు కాగా, రాయితీ రూ.60 వేలు. 1 కిలోవాట్‌ సామర్థ్యం ఉన్న వ్యవస్థకు ఖర్చు రూ.70 వేలు కాగా, రాయితీ రూ.30 వేలు.

వివరాలు 

లబ్ధిదారుల ఎంపిక 

వినియోగదారులు వారి ఇంటి విద్యుత్‌ అవసరాలను బట్టి సోలార్‌ రూఫ్‌టాప్‌ సామర్థ్యాన్ని ఎంచుకోవచ్చు. లబ్ధిదారులు 10% వాటా చెల్లించాలి, మిగతా మొత్తం 7% వడ్డీపై బ్యాంకుల ద్వారా రుణం పొందే బాధ్యతను సెర్ప్‌ అధికారులు నిర్వహిస్తారు. లబ్ధిదారులు 10% వాటాను కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉంటే, ఆ మొత్తాన్ని బ్యాంకు, స్త్రీనిధి, లేదా పొదుపు గ్రూపుల నుంచి అందించనున్నారు.