
Covid cases: కొత్తగా 573 మందికి కరోనా.. 263కు చేరిన JN.1 కేసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కరోనా కేసులు పెరుగుదల ఆగడం లేదు. దేశంలో గత 24 గంటల్లో 573 కొత్త కోవిడ్ -19కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కు పెరిగింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కోవిడ్ కారణంగా కొత్తగా ఇద్దరు మణించారు. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో మరొకరు చనిపోయారు.
దేశంలో ఇప్పటివరకు మొత్తం 263కరోనా వైరస్ సబ్-వేరియంట్ JN.1 కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది.
డిసెంబర్ 5 వరకు రోజువారీ కోవిడ్-19 కేసుల రెండంకెలకు మించలేదు.
JN.1సబ్-వేరియంట్ ఉద్ధృతి నేపథ్యంలో కేసులు మళ్లీ పెరితున్నాయి.
2020లో కరోనా మొదలు కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి పైగా ప్రజలు వైరస్ బారిన పడ్డారు.
కరోనా
సగం కేరళలోనే..
JN.1 కేసుల్లో సగం వరకు కేరళోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కేరళలో 133 కేసులు, గోవాలో 51, గుజరాత్‌లో 34, దిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో (5), తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశా 1 చొప్పున JN.1 కేసులు నమోదైనట్లు కేంద్రం పేర్కొంది.
263 JN.1 వైరస్ సబ్-వేరియంట్ కేసుల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే 239 నమోదైనట్లు చెప్పింది.
అయితే JN.1 వేరియంట్ అంతగా ప్రమాదకరమైనది కాదని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. JN.1 వేరియంట్ కేసులు భారత్‌తో ప్రపంచవ్యాప్తంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.