Hyderabad: హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 3 కి.మీ మేర నిలిచిన వాహనాలు!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 23, 2026
03:46 pm
ఈ వార్తాకథనం ఏంటి
శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కల్వర్టును ఢీకొన్న ఓ కంటైనర్ అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. కంటైనర్‌ను భారీ క్రేన్ సాయంతో తొలగించేందుకు పోలీసులు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ట్రాఫిక్ జామ్‌లో బీజేపీ ఎంపీ డీకే అరుణ కాన్వాయ్ కూడా చిక్కుకుంది. కంటైనర్‌ను తొలగించే పనులు కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.