Page Loader
#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం 
#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం

#Nara Lokesh: యువగళం పాదయాత్రలో నారా లోకేశ్‌కు గాయం 

వ్రాసిన వారు Stalin
Dec 18, 2023
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

'యువగళం పాదయాత్ర'లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు స్వల్ప గాయమైంది. పాదయాత్ర పరవాడ మండలంలోకి ప్రవేశించగా.. ఈ సమయంలో లోకేశ్ అభివాదం చేస్తుండగా.. ఒక వ్యక్తి అతని కుడి చేతిని బలంగా తాకాడు. దీంతో లోకేశ్ చేతిపై నరంపై ఒత్తిడి పెరిగింది. దీనివల్ల లోకేశ్ చేతికి స్వల్పంగా వాపు వచ్చినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం ఆయనకు నొప్పి తగ్గినట్లు వెల్లడించారు. నొప్పి తగ్గిన తర్వాత లోకేశ్ తన పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. లోకేశ్ పాదయాత్ర సోమవారానికి 225వ రోజుకు చేరుకుంది. ఇదిలా ఉంటే, పాదయాత్రలో భాగంగా లోకేష్ ఇప్పటివరకు 155ముఖాముఖి సమావేశాలు, 70 బహిరంగసభలు నిర్వహించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

225వ రోజుకు చేరుకున్న యువగళం పాదయాత్ర