Page Loader
BR Ambedkar Birth Anniversary 2024: అంబేద్కర్​ కు  హాస్య చతురత ఎక్కువే...

BR Ambedkar Birth Anniversary 2024: అంబేద్కర్​ కు  హాస్య చతురత ఎక్కువే...

వ్రాసిన వారు Stalin
Apr 13, 2024
05:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీఆర్ అంబేద్కర్​ అంటే ఆయనో మేధావి. భారత రాజ్యాంగ నిర్మాత, అట్టడుగు వర్గం నుంచి పైకి వచ్చి ఉన్నత చదువులు చదివారని మాత్రమే మనకు తెలుసు. కానీ ఇదంతా ఒక కోణమే. ఆయనలో మరో కోణం ఏమిటంటే ఆయనలో సెన్సాఫ్ హ్యుమర్ కూడా ఎక్కువేనంట. అదేనండీ హాస్య చతురత. వాస్తవానికి ఆయనకు కళలన్నా, గార్డెనింగ్ అన్నా చాలా ఇష్టం. ఎక్కువగా మ్యూజిక్​, పెయింటింగ్ తో సమయాన్ని గడిపేవారంట. కానీ ఎక్కువ సమయం మాత్రం పాటలు వినడం, పెయింటింగ్స్ కే కేటాయించేవారట. ఆయన వద్ద చాలా రకాలపై ఆర్ట్ ఫామ్స్ ఉండేవని, ఆయన ఎక్కడివి వెళ్లినా ఆయనకు నచ్చిన ఆర్ట్ ను పట్టుకొచ్చే వారని ఆయనను బాగా తెలిసిన వారు చెబుతారు.

Ambedkar sense of humor 

వయోలిన్​ నేర్చుకున్నారు కూడా...

వినడమే కాకుండా నేర్చుకున్నారు కూడా. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఆయన వయోలిన్ నేర్చుకునేవారట. ఈ విషయాన్ని వయోలిన్ విద్వాంసుడు ఆయన గురువు బలవంత్ సాతే అప్పట్లోనే ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంబేద్కర్​ ఆరోగ్య క్షీణించిన రోజుల్లోనే ఆయన సంగీత సాధన కూడా వదల్లేదట. ఆయనకు మంచి హాస్య చతురత అదేనండీ సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉందట. బంధువులు, స్నేహితులతో చాలా ఓపెన్ గా హాస్యాన్ని రంగరించి మాట్లాడేవారట. ఎవరేమనుకుంటారో అనే ఆలోచన లేకుండా మన:స్ఫూర్తిగా నవ్వుకునేవారు. అంబేడ్కర్ జోకులు వేయడమే కాదని, ఇతరులు వేసిన జో క్​ లు కూడా విని ఆస్వాదించే వారని ఆయన పర్సనల్ అసిస్టెంట్ నానక్ చందూ రత్తూ చెప్పారు.