శివమొగ్గ ఐఎస్ కుట్ర కేసు: ఇద్దరు బీటెక్ గ్రాడ్యుయేట్లపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్
శివమొగ్గ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కుట్ర కేసులో ఇద్దరు రాడికలైజ్డ్ బి.టెక్ గ్రాడ్యుయేట్‌లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. కర్ణాటకలో జాతీయ జెండాను దహనం చేయడంతో సహా రెండు డజన్లకు పైగా పేలుళ్లకు పాల్పడిన శివమొగ్గకు చెందిన బి.టెక్ గ్రాడ్యుయేట్లు మాజ్ మునీర్ అహ్మద్ (23), సయ్యద్ యాసిన్ (22)లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. మాజ్, సయ్యద్ యాసిన్ శివమొగ్గ జిల్లాలోని అగుంబే, వారాహి నది బ్యాక్ వాటర్స్ అటవీ ప్రాంతంలో రహస్య స్థావరాల కోసం ట్రెక్కింగ్‌కు వెళ్లి వెళ్లినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ రహస్య ప్రాంతాల్లో ఇద్దరు ఐఈడీని తయారు చేసినట్లు అధికారులు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
ఉగ్రవాద కార్యకలాపాల కోసం విదేశీ ఖతాల నుంచి నిధులు ట్రాన్స్‌ఫర్
మాజ్, యాసిన్ నిషేధిత ఐఎస్ టెర్రర్ గ్రూప్ కుట్రలో భాగంగా కర్ణాటకలో 25కు పైగా కాల్పులు, విధ్వంసం, హింసాత్మక చర్యలను పాల్పడున్నట్లు ఎన్‌ఐఎ అభియోగాలు మోపింది. ఐఎస్ కుట్రలో భాగంగా నిందితుడు మహ్మద్ షరీఖ్ గతేడాది నవంబర్ 19న మంగళూరులోని కద్రి ఆలయంలో ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేసినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. దురదృష్టవశాత్తు టైమర్ లోపం కారణంగా ఐఈడీ ఆటోలో ముందుగానే పేలిపోవడంతో వారి కుట్ర భగ్నమైనట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించేందుకు మాజ్, యాసిన్‌కు విదేశీ అకౌంట్ల నుంచి క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బులు చేరినట్లు ఎన్‌ఐఏ చెబుతోంది. మాజ్ స్నేహితుల ఖాతాల్లోకి రూ. 1.5 లక్షలకు సమానమైన క్రిప్టోకరెన్సీ, యాసిన్ స్నేహితుడి ఖాతాలోకి రూ.62వేలు వచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది.