Telagana Elections 2023 : మిర్యాలగూడలో ద్విముఖ పోరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పైచేయి ఎవరిది?
ఈ వార్తాకథనం ఏంటి
మిర్యాలగూడ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన నియోజకవర్గం. ఈ అసెంబ్లీ ఎన్నిక్లలో మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ద్విముఖ పోరు నెలకొంది.
1956లో ఏర్పడిన మిర్యాలగూడకు కాంగ్రెస్ కంచుకోటగా పేరుంది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అత్యధికంగా ఏడు సార్లు గెలిచింది.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున భాస్కర్ రావు, కాంగ్రెస్ తరఫున బత్తుల లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు.
దీంతో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భాస్కర్ రావు ఊవ్విళ్లూరుతుండగా, నియోజకవర్గంలో విజయం సాధించి కాంగ్రెస్‌కు మళ్లీ పునర్వైభవం తీసుకురావాలని బత్తుల లక్ష్మారెడ్డి ఆశపడుతున్నారు.
ఎన్నికలు
2014 తర్వాత బలపడ్డ బీఆర్ఎస్..
తెలంగాణ ఏర్పడక ముందు, అంటే 2014అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మిర్యాలగూడలో టీడీపీ- కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది.
కానీ 2014ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. 2014ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భాస్కరరావు గెలిచారు.
అయితే ఆ తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్లారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కులేకుండా పోయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ కొంచెం బలహీనపడింది. ఈ క్రమంలో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్( బీఆర్ఎస్) భాస్కరరావును బరిలోకి దిపింది. ఆ ఎన్నికల్లో కారు పార్టీ నియోజకవర్గంలో తొలిసారి గెలిచింది.
అయితే ఆ ఎన్నికల్లో స్థానికేతరుడైన బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో భాస్కరరావు ఎన్నిక సులభమైనట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.
ఎన్నికలు
బత్తుల లక్ష్మారెడ్డి పోటీతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోరు..
ఈ ఎన్నికల్లో స్థానికుడైన బత్తుల లక్ష్మారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఈయనకు టికెట్ ఇవ్వడం ద్వారా నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని పార్టీ భావిస్తోంది.
ఈయనను అభ్యర్థికంగా భాస్కర్‌రావు కాంగ్రెస్‌ను వీడిన తర్వాత పార్టీకి నియోజకవర్గంలో సరైన నాయకుడు లేడు.
బత్తుల లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపింది.
సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడలో సీపీఎంకు కూడా సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. ఈ ఎన్నికల్లో సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి పోటీ చేస్తున్నారు.
ఈయన స్థానికుడు కావడం, ఇదివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభువం ఉంది.
రంగారెడ్డి చీల్చే ఓట్లను బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ గెలుపు ఆధారపడి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.