Loading...
Annamayya District: అన్నమయ్య జిల్లాలో నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత.. పుంగనూరు,రాయచోటిలో వైకాపా,తెదేపా రాళ్లదాడి
పుంగనూరు,రాయచోటిలో వైకాపా,తెదేపా రాళ్లదాడి

Annamayya District: అన్నమయ్య జిల్లాలో నామినేషన్ల తొలిరోజే ఉద్రిక్తత.. పుంగనూరు,రాయచోటిలో వైకాపా,తెదేపా రాళ్లదాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. జిల్లాలోని పుంగనూరు, రాయచోటిలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న సమయంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో రాళ్లదాడి జరగడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రాయచోటిలోని ఎస్‌ఎన్‌ కాలనీలో కొన్ని వాహనాలకు నిప్పంటించారు. పుంగనూరులో వైకాపా నేతలు జరిపిన దాడిలో పలువురు తెదేపా నేతలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకే సమయంలో వైకాపా, తెదేపాలకు చెందిన నేతలు నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లడంతో ఈ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు సమాచారం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పుంగనూరులో రాళ్ల దాడి చేసుకున్న టీడీపీ, వైసీపీ శ్రేణులు

ADVERTISEMENT