2023: న్యూ ఇయర్ పార్టీ.. హ్యాంగోవర్ కి ఔషధాలు
కొత్త సంవత్సరాన్ని చాలా గట్టిగా సెలెబ్రేట్ చేసుకోవడాకి అన్నీ అరేంజ్ చేసుకుని పూర్తిగా సిద్ధమైపోయారు. కొంతమంది ఆల్రెడీ పార్టీ మూడ్ లోకి వెళ్ళిపోయారు. కొత్త సంవత్సరాన్ని ఆస్వాదించడంలో ఆమాత్రం జోష్ తప్పనిసరి. న్యూ ఇయర్ పార్టీలో మద్యం ఖచ్చితంగా ఉంటుంది. దాంతో అందరూ ఫుల్ తాగేస్తారు. కానీ మరుసటి రోజు చాలామంది హ్యాంగోవర్ నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు మార్కెట్లో హ్యాంగోవర్ ని తరిమికొట్టే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రకృతిలో దొరికే వస్తువులతో హ్యాంగోవర్ ని ఎలా తరిమికొట్టవచ్చో తెలుసుకుందాం. నీళ్ళు ఎక్కువగా తాగాలి: పార్టీ జరిగిన మరుసటి రోజు నీళ్ళు ఎక్కువ తాగాలి. ఆల్కహాల్ వల్ల శరీరంలో నీరు ఇంకిపోతుంది. దానివల్లే అలసట వంటి సమస్యలు వస్తాయి.
హ్యాంగోవర్ ని తరిమికొట్టే మరిన్ని పద్దతులు
కాఫీ: ఈ పద్దతి చాలామందికి తెలిసే ఉంటుంది. కాఫీలోని కెఫైన్ కారణంగా హ్యాంగోవర్ తగ్గిపోతుంది. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ, హ్యాంగోవర్ నుండి మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అల్లం: హ్యాంగోవర్ వల్ల కడుపు నొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. దీన్ని నివారించడానికి అల్లం బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సాయపడతాయి. అల్లం టీ తాగితే సరిపోతుంది. నిమ్మరసం: ఆల్కహాల్ కారణంగా శరీరంలోని నీటిశాతం తగ్గిపోతుంది. దాన్ని సరి చేయడానికి నిమ్మరసం ఉపయోగపడుతుంది. ఆల్కహాల్ జీర్ణమవడంలో ఇది తోడ్పడుతుంది. కార్బో హైడ్రేట్స్ తినడం: హ్యాంగోవర్ లో భాగంగా కొందరికి తలనొప్పి, అలసట ఎక్కువగా ఉంటుంది. ఈ టైమ్ లో కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకుంటే మంచిది.