సోషల్ మీడియాతో విసిగిపోయారా? ఆన్ లైన్ లో ఈ పనులు మొదలు పెట్టండి
కొన్ని కొన్నిసార్లు టైమ్ ఎంతకీ గడవదు. ఏదో తెలియని బోరింగ్ ఫీలింగ్ మనల్ని ఆక్రమించుకుంటుంది. ప్రతీ ఒక్కరికీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది. సోషల్ మీడియా కూడా విసుగు పుట్టిస్తుంది. ఏదో తెలియని చిరాకు వెంటాడుతుంది. అలాంటి టైమ్ లో ఆన్ లైన్ లో కొన్ని పనులు మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో స్క్రోలింగ్ కాకుండా, వీడియోలు చూడకుండా పాడ్ కాస్ట్ లు వినండి. మీకు నచ్చిన విషయాల మీద పాడ్ కాస్ట్ వెతుక్కుని వినండి. మీకు తెలియకుండానే మీరు వీటితో లవ్ లో పడిపోతారు. హాబీని అలవర్చుకునే వీడియోలను చూడండి. గార్డెనింగ్, ఇంటిని ఎలా సర్దుకోవాలో చెప్పే వీడియోలు చూస్తుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.
కాలక్షేపానికి పనికొచ్చే మరిన్ని ఆన్ లైన్ పనులు
విష్ లిస్ట్ క్రియేట్ చేయండి. షాపింగ్ యాప్స్ లోకి ఎంటర్ అయ్యి మీకు ఫ్యూఛర్ లో అవసరమయ్యే వస్తువులను మీ కార్ట్ లోఉంచుకోండి. ఆన్ లైన్ టెస్టులు, క్విజ్ లలో పాల్గొనండి. వీటిల్లో ఆన్సర్ చేస్తున్నకొద్దీ మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. కాలక్షేపంతో పాటు విజ్ఞానం అదనంగా వస్తుంది. క్లాస్ తీసుకోండి. చాలామందికి అవతలి వారికి చెప్పాలన్న అభిలాష ఎక్కువగా ఉంటుంది. వినేవాళ్ళున్నప్పుడు వీళ్ళు మరీ రెచ్చిపోతారు. మీకు బాగా ప్రావీణ్యం ఉన్న ఏదైనా టాపిక్ మీద ఆన్ లైన్ లో క్లాస్ తీసుకోండి. ఇవేమీ వర్కౌట్ అవకపోతే రెడ్డిట్ అనే వెబ్ సైట్ లో ఎంటర్ అవ్వండి. అక్కడ వివిధ విషయాల మీద ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది.