చర్మ సంరక్షణ: టీ తాగితే మొటిమలు దూరమవుతాయనిమీకు తెలుసా? ఇది చూడండి
మొటిమలు చాలా సాధారణ సమస్య. దీన్ని పోగొట్టడానికి చాలా మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రకృతి వైద్యం కూడా మొటిమలను పోగొడుతుంది. ప్రకృతి వైద్యం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఆ ప్రకృతి వైద్యంలో టీ కూడా ఉంది. ఎలాంటి రకమైన టీ తాగితే మొటిమలు పూర్తిగా తగ్గుతాయో, వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. పసుపు టీ: నీటిని మరిగించి అందులో తేయాకు వేసి కొంత పసుపు, కొన్ని నల్ల మిరియాలను కలిపి మరిగించాలి. కాసేపయ్యాక వడపోసి తాగాలి. పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం ఉంటుంది. దీనిలో యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల చర్మంపై మొటిమలు మాయమవుతాయి. మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలు కూడా మానిపోతాయి.
మొటిమలను దూరం చేసే టీ రకాలు మీకోసమే
గ్రీన్ టీ: శరీరంలోని విషాలను బయటకు పంపే పోషకాలు గ్రీన్ టీ లో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫాలిఫినాల్స్ వల్ల మొటిమలు తగ్గుతాయి. నీళ్ళు మరిగించి అందులో గ్రీన్ టీ వేసి వడపోయాలి. తేనే లేదా నిమ్మరసం కలుపుకుని తాగితే బాగుంటుంది. మందార పువ్వు టీ: చర్మం మీద ఎక్కువగా ఏర్పడే ఆయిల్ ని తగ్గించి మొటిమలు రాకుండా మందార పువ్వు చూసుకుంటుంది. అంతేకాదు కొల్లాజెన్ ఉత్పత్తిలో సాయపడుతుంది. కొల్లాజెన్ వల్ల చర్మం మళ్ళీ పుట్టుకొస్తుంది. మృతకణాలు తొలగిపోతాయి. నీళ్ళలో మందార పువ్వు రేకులను వేసి మరిగించాలి. 10నిమిషాల తర్వాత ఆ ద్రావణాన్ని పక్కకు దించి వడబొసి, తేనే కలుపుకుని హాయిగా సేవించండి. మొటిమలు తగ్గాలంటే రోజుకు రెండుసార్లు ఈ టీ తాగాలి.