
Christmas Tree Decoration: ఈ చిట్కాలతో క్రిస్మస్ చెట్టును ఈజీగా, చౌకగా అలంకరించుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకుంటారు.
ఈ పండగకు క్రిస్మస్ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ చెట్టును ప్రత్యేకంగా అలంకరిస్తారు.
ఈసారి క్రిస్మస్ చెట్టును ఆకర్షణీయంగా, సింపుల్‌గా, చౌకగా అలంకరించుకునే కొన్ని పద్దతుల గురించి తెలుసుకుందాం.
థీమ్‌ను బట్టి అలంకరించడం
క్రిస్మస్ చెట్టును ఎప్పటిలాగా కాకుండా సాంప్రదాయేతర రంగులతో అలంకరించడం వల్ల ప్రత్యేకంగా కనిపిస్తుంది.
థీమ్‌ను బట్టి క్రిస్మస్ చెట్టును అలంకరిస్తే ప్రత్యేక రూపాన్ని సంతరించుకుంటుంది.
మంచుతో నిండిన వండర్‌ల్యాండ్ లేదా ఇష్టమైన సినిమా నుండి ఏదైనా థీమ్‌ను ఎంచుకొని, దానికి సరిపోయేలా వస్తువులు, లైట్లు, రిబ్బన్‌లను ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
క్రిస్మస్
ఎల్ఈడీ కొవ్వొత్తులతో..
చిన్న ఎల్ఈడీ క్యాండిల్ లేదా, క్లిప్-ఆన్ క్యాండిల్ లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా క్రిస్మస్ చెట్టును ఆహ్లాదకరంగా, ఫ్యాన్సీగా మార్చుకోవచ్చు. వీటిని కొమ్మల మధ్య జాగ్రత్తగా అమర్చాలి.
చెట్టును తలక్రిందులుగా ఏర్పాటు చేయడం
క్రిస్మస్ చెట్టును తలక్రిందులుగా ఏర్పాటు చేయడం వల్ల వచ్చేఅతిథులకు ప్రత్యేకమైన ట్విస్ట్ ఇవ్వొచ్చు. ఈ ప్రక్రియను ఎంచుకున్నడు.. ఏ ప్రదేశంలో క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తున్నామనేది కీలకం.
అలంకరణలో చమత్కారాన్ని చూపించడం
క్రిస్మస్ చెట్టు అలంకరణలో కాస్త చమత్కారాన్ని చూపించడం ద్వారా పిల్లలను ఆకట్టుకోవచ్చు.
చిన్న సైకిళ్లు, అందమైన జంతువులు, సినిమా పాత్రలు వంటి బొమ్మలను అమర్చడం వల్ల క్రిస్మస్ చెట్టు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.
మీరు సంగీత ప్రియులైతే.. చిన్న వాయిద్యాలను కూడా వేలాదీయొచ్చు.