NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి
    లావుగా ఉన్నవాళ్ళు సన్నగా కనిపించడానికి బట్టల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    లావుగా ఉండేవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 16, 2023
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మీరు లావుగా ఉన్నారా? మీకు బట్టలు సెలెక్ట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? మీరు సెలెక్ట్ చేసుకున్న బట్టల్లో ఇంకా లావుగా కనిపిస్తున్నారా? ఇలాంటప్పుడే కొన్ని చిట్కాలు అవసరమవుతాయి.

    లావుగా ఉండే మగవాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో చూద్దాం.

    అడ్డగీతలు ఉండే బట్టలు వేసుకోకూడదు

    షర్ట్ మీద అడ్డగీతలు ఉన్న వాటిని వేసుకోవడం వల్ల మీరు లావుగా, పొట్టిగా కనిపిస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే నిలువవు గీతలున్న షర్ట్స్ మాత్రమే వేసుకోవడానికి ట్రై చేయండి.

    చర్మానికి అతుక్కుపోయేలా ఉండే బట్టలు లేదా వదులుగా ఉండే బట్టలు మీరు వేసుకోకూడదు. మీకు సరిగ్గా సరిపోయే బట్టలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. షాపింగ్ కి వెళ్లేటప్పుడు ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు.

    ఫ్యాషన్

    లావుగా కనిపించకుండా ఉండడానికి ధరించాల్సిన బట్టలు

    వి నెక్ కాలర్ టీ షర్టులు మాత్రమే ధరించండి. రౌండ్ కాలర్ టీ షర్టులు వేసుకోవడం వల్ల మీ మొహం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది. వి నెక్ రకం టీ షర్టుల వల్ల మీ మెడ భాగం కనిపిస్తుందనుకుంటే గడ్డం పెంచేసి కవర్ చేయండి.

    ఇక ప్యాంటుల విషయానికి వస్తే, కాలికి అతుక్కుపోయేలా ఉండే ప్యాంటుల వైపు వెళ్లకూడదు. పెన్సిల్ కట్ లాంటి ప్యాంట్లు చూడడానికి బాగానే ఉన్నా కూడా కొంచెం లావుగా ఉన్న వాళ్లకి సెట్ కావు. సో వాటి గురించి ఆలోచించడం మానేసి స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్ల వైపు చూడండి.

    ఇంట్లో ఉన్నప్పుడు షార్ట్స్ వేసుకునే అలవాటు మీకుంటే మీరు వేసుకునే షార్ట్స్.. మోకాలి భాగం దాటి కిందికి వెళ్లకుండా చూసుకోండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Israel: సహాయ కేంద్రం వద్ద కాల్పులు.. గాజాలో 30 మంది మృతి ఇజ్రాయెల్
    Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధానిపై మరో సంచలన కేసు నమోదు షేక్ హసీనా
    Opal Suchata: 'ప్రభాస్‌ మూవీ చూడగానే రివ్యూ ఇస్తా' : ప్రపంచ సుందరి ప్రభాస్
    Sharmishta Panoli: 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అరెస్ట్‌.. విడుదల చేయాలంటూ ప్రధాని మోదీని కోరిన డచ్ ఎంపీ ఆపరేషన్‌ సిందూర్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025