జీర్ణ సమస్యలను అరికట్టే హెర్బల్ టీ.. ఇంట్లోనే తయారు చేసుకోండి
జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా సరైన ఆహారాన్ని తినలేకపోతున్నారు. దానివల్ల ఆ ఆహారం సరిగ్గా జీర్ణం అవక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఈ హెర్బల్ టీ తాగండి. ఇందులో 4 రకాలున్నాయి. మీకు నచ్చిన టీని మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంటగదిలో ఉండే వస్తువులతో తయారయ్యే ఈ టీ, జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. పుదీనా టీ: ఒక పాత్రలో పాలను వేడి చేసి, అందులో పుదీనా ఆకులను వేసి కాచి వడబోస్తే వచ్చేదాన్ని హాయిగా సేవించవచ్చు. అల్లం టీ: ఈ టీ గురించి అందరికీ తెలుసు. కానీ దానివల్ల వచ్చే లాభాలు కొందరికే తెలుసు. ఇది కడుపును ఖాళీ చేయడంలో హెల్ప్ చేస్తుంది.
సోంఫు టీ, లెమన్ బామ్
సోంఫు టీ: రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత బిల్ తో పాటు సోంఫు కూడా ఇస్తారు. అది తింటే అన్నం తొందరగా అరుగుతుందని చెబుతారు. అది నిజమే. సోంఫు గింజలతో టీ తయారు చేసుకుంటే అది జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒక చిన్న పాత్రలో నీళ్ళు వేడి చేసి, దానిలో సోంఫు గింజలు, అల్లం వేసి మరిగించాలి. ఆ తర్వాత వడబోసి సేవించాలి. రుచి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు. ఇక చివరగా లెమన్ బామ్ టీ. నిద్రలేమితో బాధపడే వారికి లెమన్ బామ్ చాలా బాగా పనిచేస్తుంది. లెమన్ బామ్ టీ వల్ల కడుపులో పేగుల కదలికలు సాధారణంగా ఉంటాయి. జీర్ణాశయ పనితీరు మెరుగుపడుతుంది.