ప్రేరణ: ఇతరుల కోసం చెయ్యి అందించు, కానీ నువ్వు కిందకు వెళ్ళకుండా చూసుకో
ఈ వార్తాకథనం ఏంటి
ఇతరులకు సాయం చేయడం చాలా మంచి పద్దతి. కానీ ఆ సాయం ఏ మేరకు ఉండాలనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు చేస్తున్న ఆ సాయమే మిమ్మల్ని కిందకు లాగేస్తుంటుంది.
అలాంటప్పుడే మీరు అలర్ట్ గా ఉండాలి. ఒకరు 5లక్షలు అప్పు అడిగారనుకుందాం. అతనికి ఆల్రెడీ అంతకుముందు 2లక్షలు ఇచ్చారు. ఆ అప్పు ఇంకా తీర్చలేదు.
అయినా 5లక్షలు అడుగుతున్నారు. కొన్ని రోజుల్లోనే తీరుస్తానంటున్నాడు. కానీ ఎప్పటి నుండో కొనాలనుకుంటున్న ఫ్లాట్ కోసం ఆ డబ్బును దాచారు.
ఇంకో రెండు రోజుల్లో అడ్వాన్స్ డబ్బు కట్టాలని మీకు ఆదేశాలు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో మీరు మీ ఫ్రెండ్ కు సాయం చేసారు.
Details
ఉన్నదానికన్నా ఎక్కువ సాయం చేయడం మీకు నష్టాన్ని చేకూరుస్తుంది
నెలలు గడిచినా మీ డబ్బు మీ చేతికి రాలేదు. కాల్ చేస్తుంటే అస్సలు లిఫ్ట్ కూడా చేయట్లేదు. ఇక్కడేమో మీరు కొనాలనుకున్న ఫ్లాట్ ని వేరే వాళ్ళు కొనేసారు.
ఇప్పుడు మీ చేతిలో ఒక్క రూపాయి లేదు. అద్దె ఇంట్లోంచి మరికొన్ని రోజుల్లో విముక్తి అనుకున్న మీకు, మళ్ళీ అద్దె ఇల్లే దిక్కయ్యింది. ఇలాంటి స్థితి రావడానికి కారణం మీరు మీకు సరైన ప్రాధాన్యతను ఇచ్చుకోకపోవడమే.
అంటే సాయం చెయ్యవద్దని కాదు. మీకున్న దాంట్లో కొంత ఇవ్వడం తప్పు లేదు. ఉన్నదంతా ఇచ్చేస్తే ఆ తర్వాత మీకు సాయం చేయడానికి ఎవరూ రాకపోవచ్చు.
కాబట్టి మీకు మీరు ముందు సాయం చేసుకోండి. ఆ తర్వాత ఇతరులకు ఖచ్చితంగా సాయం చేయండి.