Loading...
Navratri Special Prasadam: అమ్మవారికి కదంబం నైవేద్యం.. ఆలయాల్లో లాంటి రుచి రావాలంటే ఇలా తయారు చేయండి!
అమ్మవారికి కదంబం నైవేద్యం.. ఆలయాల్లో లాంటి రుచి రావాలంటే ఇలా తయారు చేయండి!

Navratri Special Prasadam: అమ్మవారికి కదంబం నైవేద్యం.. ఆలయాల్లో లాంటి రుచి రావాలంటే ఇలా తయారు చేయండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2026
03:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అలాంటి ప్రత్యేకమైన ప్రసాదాల్లో కదంబం కూడా ఒకటి. ఇది నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడమే కాకుండా, సాధారణ రోజుల్లోనూ సంపూర్ణ భోజనంగా తీసుకోవచ్చు. వివిధ రకాల కూరగాయలు, బియ్యం, పప్పులతో తయారయ్యే ఈ వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. కదంబాన్ని వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించవచ్చు. మరి ఈ తొమ్మిది రోజుల పండుగలో అమ్మవారికి సమర్పించే కదంబం ప్రసాదాన్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

వివరాలు

కదంబం తయారీకి కావాల్సిన పదార్థాలు

బియ్యం - 3/4 కప్పు

కందిపప్పు - 1/2 కప్పు

పసుపు - కొద్దిగా, అలాగే కూరగాయల మిశ్రమానికి 1/2 టేబుల్ స్పూన్

సొరకాయ, గుమ్మడికాయ, చిలకడదుంప, క్యారెట్, బెండకాయ, వంకాయ, టమాటాలు

తగినంత - పచ్చిమిర్చి

తగినంత - కరివేపాకు, కొత్తిమీర

తగినంత - ఉప్పు

1 టీస్పూన్, అవసరాన్ని బట్టి అదనంగా

నీళ్లు - అవసరమైనంత

చింతపండు గుజ్జు - తగినంత

కారం - 1 టీస్పూన్

సాంబార్ పొడి - 2 టేబుల్ స్పూన్లు

కదంబం మసాలా పొడి కోసం

పచ్చిశనగపప్పు - మినపగుళ్లు - మెంతులు - మిరియాలు - ధనియాలు - బ్యాడిగి ఎండుమిర్చి - జీలకర్ర

వివరాలు

తాలింపు కోసం

నెయ్యి

ఆవాలు

జీలకర్ర

ఇంగువ

ఎండుమిర్చి

కరివేపాకు

కదంబం తయారీ విధానం

స్టెప్ 1 బియ్యం, కందిపప్పు ఉడికించుకోవాలి

ముందుగా 3/4 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.

అందులో 3 కప్పుల నీళ్లు పోసి కనీసం గంటసేపు నానబెట్టాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి, మీడియం ఫ్లేమ్‌పై మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

ADVERTISEMENT

వివరాలు

స్టెప్ 2: కూరగాయలను ఉడికించాలి

ఒక పెద్ద గిన్నెలో సొరకాయ, గుమ్మడికాయ, చిలకడదుంప, క్యారెట్, బెండకాయ, వంకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి.

వీటిలో అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టీస్పూన్ ఉప్పు, 2 కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. అనంతరం మూత పెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.

మీకు అందుబాటులో ఉన్న కూరగాయలను కూడా ఈ వంటకంలో ఉపయోగించుకోవచ్చు.

ADVERTISEMENT

వివరాలు

స్టెప్ 3: ప్రత్యేక మసాలా పొడి తయారు చేసుకోవాలి

కదంబానికి ప్రత్యేకమైన రుచి రావాలంటే మసాలా పొడి తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఒక పాన్‌ను స్టవ్‌పై పెట్టి పచ్చిశనగపప్పు, మినపగుళ్లను వేయించాలి.

అవి సగం వేగిన తర్వాత మెంతులు, మిరియాలు వేసి వేయించుకోవాలి. చివరిగా ధనియాలు, బ్యాడిగి ఎండుమిర్చి వేసి వేయించాలి.

ఆ తర్వాత జీలకర్ర వేసి మరో నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మసాలా పొడిని రెండు మూడు సార్లు ఉపయోగించుకోవచ్చు.

వివరాలు

స్టెప్ 4: కూరగాయల మిశ్రమంలో చింతపండు, మసాలాలు కలపాలి

ఇప్పటికే మెత్తగా ఉడికిన కూరగాయల మిశ్రమంలో చింతపండు గుజ్జు, 1 టీస్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించాలి.

స్టెప్ 5: ఉడికించిన అన్నాన్ని కలపాలి

ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బియ్యం, కందిపప్పు మిశ్రమాన్ని తీసుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా చేసుకోవాలి.

ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడికిస్తున్న కూరగాయల్లో వేసి బాగా కలపాలి.

అవసరమైనంత ఉప్పు, తరిగిన కొత్తిమీర కూడా జోడించాలి. మిశ్రమం మరీ చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.

కదంబం కొద్దిగా పల్చగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

వివరాలు

స్టెప్ 6: తాలింపు వేసి సిద్ధం చేసుకోవాలి

చివరిగా ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. అనంతరం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. తయారైన ఈ తాలింపును ఉడికించిన కదంబంలో వేసి బాగా కలపాలి.

అంతే.. కమ్మని రుచితో, ఆలయాల్లో ప్రసాదంగా అందించే రుచిని గుర్తుచేసే కదంబం సిద్ధమవుతుంది.

నవరాత్రుల సందర్భంగా ఈ కదంబాన్ని వేడివేడిగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అనంతరం ప్రసాదంగా స్వీకరించండి.

పండుగ రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ అన్నం, పప్పు, వివిధ కూరగాయలతో తయారయ్యే ఈ వంటకాన్ని సంపూర్ణ భోజనంగా ఆస్వాదించవచ్చు.

ADVERTISEMENT