రాత్రి నిద్రలేక తెల్లారి ఇబ్బందిగా ఉంటుందా? ఈ టిప్స్ ఫాలో అవ్వండి
మనుషులు పనిచేయడం ఎంత ముఖ్యమో నిద్రపోయి విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. నిద్ర వల్ల శరీరం దానికదే మరమ్మత్తు చేసుకుంటుంది. సగటున ఒక మనిషికి 7-8గంటల నిద్ర ప్రతిరోజు అవసరం. అయితే మారుతున్న జీవన విధానాల వల్ల చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. రాత్రి సరిగా నిద్ర పోకపోతే తెల్లారి ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బంది నుండి ఎలా బయటపడాలో ఫిట్ నెస్ నిపుణులు ఆకాష్ బన్సల్ ఇక్కడ తెలియజేస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగండి రాత్రి సరిగ్గా నిద్ర లేక అలసటగా ఉన్నట్లయితే నీళ్లు ఎక్కువగా తాగాలి. దీనివల్ల మీ బాడీ హైడ్రేట్ గా ఉండడంతో పాటు మీకు శక్తి వస్తుంది.
నిద్రలేమి వల్ల కలిగే అలసటను దూరం చేసే టిప్స్
ఎండలో నిలబడండి: రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల తెల్లారి కలిగే ఇబ్బందిని పోగొట్టుకోవడానికి ఎండలో నిలబడడం మంచి పద్ధతి. దీనివల్ల మీ మెదడులో సెరెటోనిన్ స్థాయిలు పెరిగి మూడ్ ప్రశాంతంగా మారుతుంది. అలాగే బద్ధకం చెదిరిపోతుంది. మధ్యాహ్నం నిద్ర మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు మీకుంటే రోజు 15-20నిమిషాలు మాత్రమే నిద్రపోండి. అంతకంటే ఎక్కువగా నిద్రపోకూడదు. చక్కెర వస్తువులు తినకూడదు రాత్రి నిద్ర లేకపోవడం వల్ల తెల్లారిన తర్వాత ఆకలి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి టైం లో చక్కెర కలిగిన ఆహారాలను తీసుకోకూడదు. కెఫైన్ తీసుకోండి దీనివల్ల మీలో కొత్త ఎనర్జీ పుట్టుకొస్తుంది. అయితే కెఫైన్ ని అధికంగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి.