
అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో ఒక ప్రత్యేకమైన రోజును ఇలా గడపండి
ఈ వార్తాకథనం ఏంటి
చిన్నప్పుడు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో గడిపిన కాలం ఎంతో సరదాగా ఉంటుంది.
పెరిగి పెద్దయిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ తో గడిపే సమయం తగ్గిపోతూ వస్తుంది. చాలామందికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో మాట్లాడడానికి సమయం ఉండదు.
మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా కొంత సమయాన్ని వారితో గడపడానికి ప్రయత్నించండి.
ప్రస్తుతం గ్రాండ్ పేరెంట్స్ తో ఒక ప్రత్యేకమైన రోజును ఎలా గడపాలో ఇక్కడ తెలుసుకుందాం.
చరిత్ర తెలుసుకోండి:
మీకంటే కనీసం 50ఏళ్ల ముందు కాలాన్ని గ్రాండ్ పేరెంట్స్ చూసి ఉంటారు, కాబట్టి ఆ కాలంలోని కొన్ని సంఘటనల గూర్చి వాళ్లను అడిగి తెలుసుకోండి.
సాధారణంగా మీరు చరిత్ర పుస్తకంలో చదివిన దానికన్నా వారు చెప్పే విషయాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
Details
బయటకు తీసుకెళ్లండి
ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా సరే తమని రెస్టారెంట్ కి తీసుకెళ్ళమని లేదా సినిమాకి తీసుకెళ్లమని అడగరు.
ఒకరోజు రెస్టారెంట్ లేదా సినిమా.. అదికూడా కాకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్లండి. దానివల్ల వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
వాళ్లతో ఆటలు ఆడండి:
ఇంట్లో ఆడుకునే కార్డ్ గేమ్స్, బోర్డు గేమ్స్, పజిల్స్ లాంటివి మీ అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో ఆడండి. దానివల్ల మీ మధ్య బంధం బలపడుతుంది.
ఇంటి పనిలో సాయం చేయండి:
గ్రాండ్ పేరెంట్స్ తో కలిసి వంట వండటం, మొక్కలకు నీళ్లు పోయడం వంటివి చేయడం వల్ల మంచి జ్ఞాపకాలు మీ సొంతమవుతాయి.