English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు
    తదుపరి వార్తా కథనం
    వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు
    టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు

    వైరల్ వీడియో: రోడ్డుకు అడ్డంగా నిల్చుని టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 10, 2023
    10:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రోడ్ల మధ్యలోకి అప్పుడప్పుడు అడవి జంతువులు వస్తుంటాయి. సాధారణంగా అలా జంతువులు వచ్చినపుడు జనాలకు భయమేస్తుంటుంది. కానీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే, అలాంటి భయమేమీ జనాల్లో కనిపించట్లేదు.

    ఒక పెద్ద ఏనుగు, రోడ్డుకు అడ్డంగా నిల్చుని పెద్ద పెద్ద ట్రక్కులను ఆపుతోంది. ఎందుకని ఆలోచిస్తున్నారా? టోల్ ట్యాక్స్ వసూల్ చేయడం కోసం.

    అంటే, చెరుకు మోసుకుని వెళ్తున్న పెద్ద పెద్ద ట్రక్కులను అడ్డంగా వెళ్తున్న ఏనుగు, ట్రక్కులోంచి కొద్దిపాటి చెరుకును తీసుకుని దారి నుండి తప్పుకుంటుంది.

    ఇలా వరుసగా ట్రక్కులు వచ్చినప్పుడల్లా కావాల్సిన చెరుకు తీసుకుని టక్కులకు దారినిస్తూ కనిపిస్తుంది. ఆ ట్రక్ డ్రైవర్లు కూడా ఏనుగు కనిపించగానే ఆపేసి, అది చెరుకు తీసుకోగానే బండిని పోనిస్తున్నారు.

    వైరల్ వీడియో

    టోల్ ట్యాక్స్ కలెక్టర్ అని పేరు పెట్టిన నెటిజన్

    ఈ వీడియోను డాక్టర్ అజయిత, ట్విట్టర్ లో షేర్ చేసారు. టోల్ ట్యాక్స్ కలెక్టర్ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. దాంతో వైరల్ అయిపోయింది.

    ఇది ఏ ప్రాంతంలో జరిగిందనేది క్లారిటీ లేదు కానీ, ఆ రోడ్డు గుండా రెగ్యులర్ గా ఏనుగులు దాటుతాయని, ఆ వీడియోలో కనిపిస్తున్న ఏనుగులు రోడ్డు దాటుతున్నాయి జాగ్రత్త అనే బోర్డ్ ద్వారా అర్థమవుతోంది.

    ఈ వీడియో నెటిజన్లు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తుంది నిజమే గానీ, మరీ ఎక్కువ చెరుకు తీసుకోకుండా కావాల్సినంత మాత్రమే తీసుకుంటోంది.. నిజంగా గ్రేట్ అని ఒకరు కామెంట్ చేసారు.

    ఈ వీడియోకు ఇప్పటివరకు 2లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 1000రీట్వీట్స్ దక్కాయి.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ వీడియో: టోల్ ట్యాక్స్ వసూల్ చేస్తున్న ఏనుగు

    The Toll Tax collector.... pic.twitter.com/gCg47mmJZm

    — Dr. Ajayita (@DoctorAjayita) March 6, 2023
    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవనశైలి

    తాజా

    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు
    Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్‌.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు జమ్ముకశ్మీర్
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! ఆంధ్రప్రదేశ్

    జీవనశైలి

    మద్యాహ్నం నిద్ర మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తోందా? ఈ పనులు చేసి చూడండి లైఫ్-స్టైల్
    ఒంటరిగా డ్యాన్స్ చేసే అలవాటు మీకుందా? అది ఆరోగ్యానికే చేసే మేలు తెలుసుకోండి లైఫ్-స్టైల్
    సిటీకి కొత్తగా వెళ్లారా? ఇంటివైపు మనసు మళ్ళుతోందా? ఈ పనులు చేయండి లైఫ్-స్టైల్
    2023 న్యూమరాలజీ: మీ సంవత్సర సంఖ్య 5-9 ఐతే మీ జీవితంలో జరిగే విషయాలు లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025