ఆపిల్ ఐఫోన్ 15ప్రో సిరీస్ మోడల్ లో యాక్షన్ బటన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ నుండి ఐఫోన్ 15ప్రో సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ యాక్షన్ బటన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
రింగ్ లేదా వైబ్రేట్ బటన స్థానంలో యాక్షన్ బటన్ వచ్చింది. ఈ బటన్ తో ఐఫోన్ ని మరింత సౌకర్యంగా ఉపయోగించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
ఐఫోన్ 15ప్రో సిరీస్ లోని యాక్షన్ బటన్ రింగ్ లేదా వైబ్రేట్ బటన్ లాగా పనిచేయడమే కాకుండా వాయిస్ మెమో, నోట్ ఓపెన్ చేయడం, ట్రాన్స్ లేషన్ ని లాంచ్ చేయడం, షార్ట్ కట్స్ ని రన్ చేయడం, ఫోకస్ మోడ్ మార్చడం కూడా యాక్షన్ బటన్ తో చేయవచ్చు.
Details
యాక్షన్ బటన్ ఎలా ఉంటుంది?
ఐఫోన్ 15ప్రో సిరీస్ మోడల్స్ లో రింగ్ లేదా వైబ్రేట్ బటన్ల సైజులోనే ఉండే ఈ యాక్షన్ బటన్, ఫోన్ ఏ రంగులో ఉందో అదే రంగులో ఉంటుంది.
ఈ బటన్ ద్వారా వినియోగదారులు తాము ఆల్రెడీ వాడిన యాప్స్ మొదలగు వాటిని వాడాలంటే మెనూ ఓపెన్ చేసి మళ్ళీ మళ్ళీ చూసుకునే అవసరం లేకుండా డైరెక్టుగా యాక్షన్ బటన్ సాయంతో ఓపెన్ చేసి చూసుకోవచ్చు.
తమ వినియోగదారులు యాపిల్ ఐఫోన్ ని మరింత సమర్థవంతంగా, సౌకర్యవంతంగా వాడేందుకు ఈ యాక్షన్ బటన్ ని ఆపిల్ కంపెనీ తీసుకొచ్చింది.