
ట్విట్టర్ టు ఎక్స్, ట్వీట్ టు పోస్ట్ మార్పులపై యూజర్ల కంగారు: ఇలా ఎందుకంటూ ప్రశ్నలు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినప్పటి నుండి ట్విట్టర్లో రకరకాల మార్పులు వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా ట్విట్టర్ పేరునే మార్చేసారు. X అనే పేరును ఎలాన్ మస్క్ ప్రకటించాడు.
అలాగే X లో ట్వీట్ కు బదులుగా పోస్ట్ అని మార్పు చేసాడు. ఇంకా రీట్వీట్ కు బదులుగా రీపోస్ట్ అని మార్చేసాడు. ఇలా వరుసగా ట్విట్టర్ తన పేరును పూర్తిగా మార్చేసుకుని తన గుర్తింపును కోల్పోతూ వస్తోంది.
అయితే ఇదంతా యూజర్లకు కంగారుగా ఉంది. ట్విట్టర్ లో ఇన్ని రకాల మార్పులు ఎందుకనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం.
పేరు మార్చడం, ట్వీట్ అన్న పరిభాషను మార్చడం వంటి విషయాలపై నెటిజన్లు అసహనానికి గురవుతున్నారు.
Details
పేరు మార్పుపై నెటిజన్ల విమర్శలు
ఈ విషయమై ఒకానొక నెటిజన్ మాట్లాడుతూ, ట్వీట్ అంటే ట్విట్టర్ ఏదైనా పోస్ట్ చేయడమని డిక్షనరీలో కూడా ఉంది. మిగతా ఏ సోషల్ మీడియా యాప్ కి ఇలాంటి గుర్తింపు లేదు. అనవసర మార్పుల వల్ల ఆ గుర్తింపు దెబ్బతింటుందని అన్నారు.
ట్విట్టర్ ను వాడని వాళ్ళకు కూడా ట్విట్టర్ గురించి పూర్తిగా తెలుసు. ఇలాంటి సమయంలో ట్విట్టర్ పేరును, పరిభాషను మార్చడం విచిత్రంగా ఉందని మరో నెటిజన్ అన్నారు.
నెటిజన్ల విమర్శలను పక్క పెడితే, ట్విట్టర్ ను ఈ కామర్స్ సైట్ గానూ, గేమింగ్ ఫ్లాట్ ఫామ్ గానూ మారాలని మస్క్ అనుకుంటున్నాడని చెబుతున్నారు.