మెటా నుండి ఏఐ చాట్ బాట్స్ వచ్చేస్తున్నాయి.. యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కంపెనీ
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత వేగంగా పెరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ఏఐ లో చాట్ జీపీటి తెచ్చిన విప్లవం అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునేలా చేసింది చాట్ జీపీటి. ఓపెన్ ఏఐ కి చెందిన చాట్ జీపీటి సక్సెస్ కావడంతో చాలా సంస్థలు చాట్ బాట్లను తెచ్చే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో మెటా కూడా చాట్ బాట్లను తీసుకొస్తుంది. మెటా నుండి వచ్చే చాట్ బాట్స్, అత్యధిక టెక్నాలజీతో తయారైనవని అంటున్నారు. మెటా సంస్థ మల్టిపుల్ చాట్ బాట్స్ ని తీసుకొస్తుంది. యంగ్ యూజర్లను టార్గెట్ చేస్తూ మల్టిపుల్ చాట్ బాట్స్ లను మెటా తీసుకొస్తున్నట్లు వాల్ స్ట్రీట్ కథనాలు రాసుకొచ్చింది.
వ్యక్తిగత సమాచారం సేకరించే చాట్ బాట్స్?
ఆల్రెడీ బాబ్ ద రోబోట్, ఆల్విన్ ద ఏలియన్ అనే రెండు చాట్ బాట్స్ ని మెటా సంస్థ టెస్ట్ చేసిందని వాల్ స్ట్రీట్ చెప్పుకొచ్చింది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఈ చాట్ బాట్స్ సేకరించి అవకాశం ఉందని మెటా ఉద్యోగి ఆందోళన పడుతున్నారు. మరో విషయం ఏంటంటే, మెటా నుండి డజన్ల కొద్ది చాట్ బాట్స్ రిలీజ్ అవుతాయట. ఈ చాట్ బాట్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు ఒకానొక సెలబ్రిటీ తన చాట్ బాట్ సాయంతో తన అభిమానులతో సంభాషించే అవకాశం ఉంటుందట. ఇంకా కొన్ని చాట్ బాట్స్ కోడింగ్, ఇతర పనులను నిర్వర్తించే విధంగా తయారు చేస్తున్నారట.