Loading...
Ashmitha Chaliha: కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలనం.. కెరీర్‌లో తొలి ప్రపంచ టూర్‌ టైటిల్
కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలనం.. కెరీర్‌లో తొలి ప్రపంచ టూర్‌ టైటిల్

Ashmitha Chaliha: కొరియా మాస్టర్స్‌లో అస్మిత సంచలనం.. కెరీర్‌లో తొలి ప్రపంచ టూర్‌ టైటిల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 10, 2026
09:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో భారత యువ షట్లర్లు వరుస విజయాలతో సత్తా చాటుతున్నారు. వారం క్రితం తన్వి శర్మ తైపీ ఓపెన్‌ టైటిల్‌ను గెలుచుకోగా.. తాజాగా అస్మిత చాలిహా కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన 26 ఏళ్ల అస్మిత.. తుది పోరులోనూ అద్భుత ప్రదర్శన చేసి విజేతగా నిలిచింది. బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌లో అస్మితకు ఇదే తొలి టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో అస్మిత 14-21, 21-14, 21-14తో నాలుగో సీడ్‌ హన్‌ కియాన్‌గ్జిన్‌ను ఓడించింది. మ్యాచ్‌ ఆరంభంలోనే భారత షట్లర్‌ దూకుడుగా ఆడింది.

వివరాలు

11-11తో స్కోరు సమం

తొలి గేమ్‌లో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లిన అస్మిత.. ఆ తర్వాత 9-5తో ముందంజలో నిలిచింది. అయితే హన్‌ కియాన్‌గ్జిన్‌ పుంజుకుని 11-11తో స్కోరును సమం చేసింది.

అక్కడి నుంచి మరింత మెరుగ్గా ఆడిన హన్‌.. తొలి గేమ్‌ను సొంతం చేసుకుని అస్మితపై ఆధిక్యం సాధించింది. రెండో గేమ్‌లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది.

అయితే విరామ సమయానికి అస్మిత 11-8తో ఆధిక్యంలో నిలిచింది.

ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదురైనా.. కీలక సమయాల్లో పాయింట్లు సాధించిన భారత షట్లర్‌ రెండో గేమ్‌ను గెలుచుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.

మూడో గేమ్‌లోనూ ప్రారంభంలో అస్మితకు కాస్త ప్రతిఘటన ఎదురైంది.

వివరాలు

గాయం నుంచి పునరాగమనం.. 14 టోర్నీలు

బ్రేక్‌ సమయానికి ఆమె 9-11తో వెనుకబడింది.

అయితే ఆ తర్వాత అస్మిత తన ఆటతీరును పూర్తిగా మార్చేసింది. వరుస పాయింట్లతో 15-11తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

అదే జోరును చివరి వరకు కొనసాగించిన ఆమె.. మూడో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచి కొరియా మాస్టర్స్‌ టైటిల్‌ను తన ఖాతాలో అస్మిత చాలిహా కెరీర్‌లో ఈ విజయం ప్రత్యేకమైనది.

2024 ఆగస్టులో జరిగిన కొరియా ఓపెన్‌లో ఆమె కుడి మోకాలిలో చీలికకు గురైంది. దీంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది.

అనంతరం 2025 ఫిబ్రవరిలో మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టిన అస్మిత.. అప్పటి నుంచి వరుసగా 14 టోర్నీల్లో పాల్గొంది.

ADVERTISEMENT

వివరాలు

అత్యుత్తమ ఆటతీరుతో తొలి టైటిల్‌ సొంతం

ఈ సీజన్‌లో చైనా మాస్టర్స్‌, మలేసియా మాస్టర్స్‌లో క్వార్టర్‌ఫైనల్స్‌ వరకు చేరిన ఆమె.. మకావు ఓపెన్‌లో సెమీఫైనల్‌ వరకు దూసుకెళ్లింది.

టోర్నీల్లో స్థిరంగా రాణిస్తున్నప్పటికీ.. కీలక దశల్లో చేసిన అనవసర తప్పిదాల కారణంగా టైటిళ్లు చేజారిపోయాయి.

అయితే కొరియా మాస్టర్స్‌లో మాత్రం ఆ తప్పిదాలను అధిగమించిన అస్మిత.. తన అత్యుత్తమ ఆటతీరుతో తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

కొరియా మాస్టర్స్‌ టైటిల్‌ ప్రయాణంలోనూ అస్మిత సంచలన విజయాలు నమోదు చేసింది. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌ సీడ్‌, జపాన్‌ షట్లర్‌ అకెచికి షాకిచ్చి సెమీఫైనల్‌కు చేరింది.

అక్కడి నుంచి ఫైనల్‌లోనూ విజయాన్ని అందుకుని కెరీర్‌లో కీలక మైలురాయిని చేరుకుంది. వేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు

ఈ విజయం నమ్మశక్యంగా లేదు

టైటిల్‌ విజయం అనంతరం అస్మిత తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. 'ఈ విజయం నమ్మశక్యంగా అనిపించట్లేదు.

భవిష్యత్తులో మరిన్ని టైటిళ్లు సాధించాలనే లక్ష్యంతో ఉన్నా. ఫైనల్లో తొలి గేమ్‌లో కాస్త తడబడ్డాను. పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.

ఆ తర్వాత పుంజుకుని విజయాన్ని అందుకున్నానని అస్మిత తెలిపింది.

ADVERTISEMENT