FIFA World cup: ఫిఫా వరల్డ్ కప్.. సెమీఫైనల్లోకి స్పెయిన్
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 11, 2026
09:44 am
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌లో స్పెయిన్ జట్టు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బెల్జియంపై 2-1 తేడాతో విజయం నమోదు చేసి చివరి నాలుగు జట్లలో చోటు దక్కించుకుంది. మ్యాచ్ 30వ నిమిషంలో రుయిజ్ గోల్ సాధించడంతో స్పెయిన్ ఆధిక్యంలోకి వెళ్లింది.
వివరాలు
ఫైనల్ బెర్త కోసం ఫ్రాన్స్‌తో పోరు..
అయితే 41వ నిమిషంలో కెటెలార్ గోల్ చేయడంతో బెల్జియం స్కోరును సమం చేసి పోరును మరింత రసవత్తరంగా మార్చింది. ఇరు జట్లు విజయం కోసం తీవ్రంగా పోరాడుతున్న సమయంలో 88వ నిమిషంలో మెరీనో కీలక గోల్ నమోదు చేయడంతో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు. ఈ విజయంతో సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టిన స్పెయిన్ జట్టు, ఫైనల్ బెర్త్ కోసం ఫ్రాన్స్‌తో తలపడనుంది.