Loading...
Yuzvendra Chahal: విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. రిహాబ్‌ సెంటర్‌కు వెళ్లా: యుజ్వేంద్ర చాహల్
విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. రిహాబ్‌ సెంటర్‌కు వెళ్లా: యుజ్వేంద్ర చాహల్

Yuzvendra Chahal: విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా.. రిహాబ్‌ సెంటర్‌కు వెళ్లా: యుజ్వేంద్ర చాహల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 16, 2026
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. తిరిగి జట్టులో చోటు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కడం లేదు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి చాహల్ తొలిసారి మనసు విప్పాడు. భార్యతో విడాకుల తర్వాత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యానని, ఆ సమయంలో మద్యపానానికి అలవాటు పడ్డానని వెల్లడించాడు. అయితే ఈ అలవాటు తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్ కెరీర్‌కు అడ్డంకిగా మారుతుందని గుర్తించి, వెంటనే రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఆశ్రయించినట్లు తెలిపాడు. ఆకాశ్ చోప్రాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో చాహల్ తన గత అనుభవాలను పంచుకున్నాడు.

వివరాలు

మద్యం అలవాటైంది

చిన్న వయసులోనే తనకు మద్యం అలవాటు మొదలైందని చెప్పిన అతడు.. విడాకుల తర్వాత ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని వివరించాడు.

వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యలతో పాటు సమాజం నుంచి వచ్చిన ఒత్తిడి కూడా తనపై ప్రభావం చూపిందని వెల్లడించాడు.

ఆ సమయంలో తాను మానసికంగా కుంగిపోయానని చాహల్ తెలిపాడు. మద్యపానం తన జీవితాన్ని ప్రభావితం చేస్తున్న విషయాన్ని క్రమంగా గుర్తించినట్లు చెప్పుకొచ్చాడు.

ముఖ్యంగా ఈ అలవాటు కారణంగా క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందనే ఆలోచన తనను ఆత్మపరిశీలన చేసుకునేలా చేసిందని వివరించాడు.

తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌ను మద్యపాన వ్యసనం కారణంగా కోల్పోయే ప్రమాదం ఉందని గ్రహించిన వెంటనే కీలక నిర్ణయం తీసుకున్నట్లు చాహల్ పేర్కొన్నాడు.

వివరాాలు

చివరికి ఆ అలవాటు నుంచి బయటపడ్డా

ఈ క్రమంలో రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఆశ్రయించి, మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. చివరకు ఆ అలవాటు నుంచి బయటపడగలిగానని వెల్లడించాడు.

విడాకుల తర్వాత తన జీవితంలో ఎదురైన సవాళ్లు, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు చేసిన ప్రయత్నాల గురించి చాహల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

వ్యక్తిగత జీవితంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ, తనకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌పై మళ్లీ దృష్టి పెట్టేందుకు తీసుకున్న నిర్ణయం గురించి ఈ ఇంటర్వ్యూలో వివరించాడు.

ADVERTISEMENT