Page Loader
Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా 
Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా

Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

రవీంద్ర జడేజా తండ్రి కోడలిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. తన తండ్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్‌పై మూడో టెస్టులో టీమిండియా విజయం సాధించింది. ఈ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును జడేజా అందుకున్నారు. అయితే ఆ అవార్డును రవీంద్ర జడేజా.. తన భార్య రివాబాకు అంకితం చేశాడు. ఆమె తనను ఎంతగానో ప్రేమించిందన్ని భార్యను ఉద్దేశించి జడేజా అన్నారు. తన భార్య ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచినందుకే తాను ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నారు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో జడేజా అద్భుత సెంచరీ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భార్యకు మద్దతుగా నిలిచిన జడేజా