Loading...
Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు.. ఇదే తన చివరి సీజన్‌ అంటూ ప్రకటన
ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు.. ఇదే తన చివరి సీజన్‌ అంటూ ప్రకటన

Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రొనాల్డో వీడ్కోలు.. ఇదే తన చివరి సీజన్‌ అంటూ ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 17, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌ చివరి దశకు చేరుకున్నట్లు స్పష్టం చేశాడు. 2026-27 సీజన్‌ తన ఫుట్‌బాల్‌ కెరీర్‌లో చివరిది కావచ్చని తాజాగా వెల్లడించాడు. దాదాపు పదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న జార్జినాను రొనాల్డో ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్‌ నాకౌట్‌ దశలోనే వెనుదిరిగింది. ఆ సమయంలోనే తనకు అదే చివరి ప్రపంచకప్‌ అని 41 ఏళ్ల రొనాల్డో ప్రకటించాడు. ఇప్పుడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ 2026-27 సీజన్‌తో ఆటకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.

వివరాలు

భవిష్యత్ కార్యచరణను త్వరలో ప్రకటిస్తా

''నా ఫుట్‌బాల్‌ కెరీర్‌కు ఇదే చివరి సీజన్‌. అభిమానులకు నా ఘనమైన వారసత్వాన్ని వదిలి వెళ్లాలని కోరుకుంటున్నా. ఫుట్‌బాల్‌ నుంచి తప్పుకున్న తర్వాత ఎలాంటి జీవితం గడపాలనే దానిపై ఇప్పటికే ఆలోచనలు ఉన్నాయి.

భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలను ఎప్పుడో సిద్ధం చేసుకున్నా. నన్ను నేను బిజీగా ఉంచుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి.

అందులో ఒక్కదాని పేరు చెప్పడం కష్టం. అయితే ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలకడం మాత్రం మాటల్లో చెప్పినంత సులభం కాదు. గత రెండున్నర దశాబ్దాలుగా ఈ ఆటతో నాకు ఎంతో అనుబంధం ఉంది.

ఈ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి'' అని రొనాల్డో పేర్కొన్నాడు.

వివరాలు

మూడేళ్ల కిందటే ఆ ఆలోచన

భవిష్యత్తులో ఓ ఫుట్‌బాల్‌ క్లబ్‌కు యజమాని కావాలనే ఆలోచన తనకు ఉందని చెప్పాడు. ''రిటైర్మెంట్‌ తర్వాత కోచ్‌గా మారడం కంటే బిజినెస్‌ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువ. ఒక క్లబ్‌కు ఓనర్‌ కావచ్చు.

చాలా కాలం నుంచే ఈ ఆలోచన ఉంది. సొంతంగా ఓ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఉండాలనేది నా ఆకాంక్ష. నా కెరీర్‌కు మరో రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని 2023లోనే రొనాల్డో చెప్పాడు.

అలాగే జాతీయ జట్టును వీడే సమయంలో ముందుగా ఎవరికీ ఆ విషయం చెప్పనని స్పష్టం చేశాడు. తన నిర్ణయం ఆకస్మికంగా అనిపించినప్పటికీ.. దాని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందని రొనాల్డో పేర్కొన్నాడు.

ADVERTISEMENT