SRH vs RR: ఉత్కంఠగా సాగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ కు విజయం
జైపూర్ లోని స్వామి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచులో 4వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. మొదట బ్యాటింగుకు దిగిన రాజస్థాన్, జోస్ బట్లర్ 95, సంజూ శాంసన్ 66, యశస్వి జైశ్వాల్ 35 పరుగుల అద్భుత ప్రదర్శనతో 20ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 214పరుగులు చేసింది. 215పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్, 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 217పరుగులు చేసి 4వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో చివరి బంతికి 4పరుగులు కావాల్సి ఉండడంతో, క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ సిక్సర్ కొట్టి సన్ రైజర్స్ కు విజయాన్ని అందించాడు.