Loading...
Air India: అక్టోబర్‌ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన
అక్టోబర్‌ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

Air India: అక్టోబర్‌ 20 వరకు విమానాల రద్దు.. ఎయిర్‌ ఇండియా కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసుల రద్దును ఎయిర్‌ ఇండియా పొడిగించింది. రియాద్‌, దమ్మామ్‌, జెడ్డా నగరాలకు రాకపోకలు సాగించే అన్ని విమానాల రద్దును అక్టోబర్‌ 20 వరకు కొనసాగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, విమాన సర్వీసులను తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయంపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించింది. విమానాల రద్దు కారణంగా ప్రయాణాలు చేయలేకపోయిన ప్రయాణికులకు టికెట్‌ నగదును వాపసు చేయనున్నట్లు ఎయిర్‌ ఇండియా తెలిపింది. ప్రయాణికులు, విమాన సిబ్బంది భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేసింది.

వివరాలు 

సౌదీ ప్రభుత్వం, ప్రజలకు సంఘీభావం

మరోవైపు, సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, విమానాలు, విమానయాన మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఐసీఏఓ) మండలి తీవ్రంగా ఖండించింది.

ఈ ఘటనల నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం, ప్రజలకు సంఘీభావం ప్రకటించింది.

పశ్చిమాసియాలో భద్రతాపరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే భారత విమానయాన సంస్థలు ఇండిగో, ఆకాశ ఎయిర్‌ కొన్ని విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

తాజాగా ఎయిర్‌ ఇండియా కూడా సర్వీసుల రద్దును పొడిగించడంతో సౌదీ అరేబియాకు ప్రయాణించాలనుకునే ప్రయాణికులు విమానాల తాజా పరిస్థితిని ముందుగానే తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

ADVERTISEMENT