NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / 'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్
    తదుపరి వార్తా కథనం
    'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్
    దక్షిణకొరియాలో వెలుగు చూసిన 'మెదడు తినే అమీబా'

    'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్

    వ్రాసిన వారు Stalin
    Dec 28, 2022
    12:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒకవైపు కరోనా పీడ తొలగకముందే.. మరోవైపు కొత్త వైరస్‌లు పుట్టుకురావడం, పాతవి తిరిగి ప్రభావాన్ని చూపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా దక్షిణ కొరియాలో 'మెదడు తినే అమీబా' వెలుగు చూడటంతో ప్రపంచ దేశాలు కలవరపాటుకు గురువుతున్నాయి.

    దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి 'మెదడు తినే అమీబా' కారణంగా మృతి చెందాడు. ఆ దేశ వైద్యాధికారులు కూడా మరణాన్ని ధృవీకరించారు. దీంతో ఆ దేశంలో ఈ అమీబా కారణంగా తొలి మరణం నమోదైనట్లు అయ్యింది.

    ఇటీవల కాలంలో ఇలాంటి కేసులు ఇంకా ఎక్కడైనా నమోదయ్యాయా ? అని దక్షిణ కొరియా అధికారులు ఆరా తీసుస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రపంచ దేశాలు 'మెదడు తినే అమీబా'పై అప్రమత్తమయ్యాయి.

    దక్షిణ కొరియా

    'మెదడు తినే అమీబా' ఆవాసాలు అవే..

    'మెదడు తినే అమీబా' అనేది.. 'నెగ్లేరియా ఫోవ్‌లేరి' అమీబా జాతికి చెందిన సూక్ష్మజీవి. ఇది ముక్కుద్వారా తలలోకి వెళ్లి నేరుగా మెదడుపై దాడి చేస్తుంది. 1937లో తొలిసారి అమెరికాలో వెలుగుచూసిన ఈ 'మెదడు తినే అమీబా'.. ఆ తర్వాత పలుసార్లు వెలుగు చూసింది. అయితే తాజాగా దక్షిణ కొరియాలో ఈ కేసు నమోదు కావడం.. ఆ వ్యక్తి చనిపోవడం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి.

    కాల్వలు, చెరువులు, మురికి గుంటలు, స్విమ్మింగ్‌ పూల్స్‌ వద్ద ఈ 'నెగ్లేరియా ఫోవ్‌లేరి' ఉంటుంది. ఇది ప్రాణాంతకమైనప్పటికీ.. ఒకరినుంచి మరొకరికి సోకదని వైద్యులు చెబుతున్నారు. 1983 నుంచి 2010 మధ్య కాలంలో ఈ ప్రమాదకర అమీబా కారణంగా దాదాపు 28 మంది చనిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రపంచం

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    ప్రపంచం

    12 ఏళ్ల తరువాత టెస్టులోకి జయదేవ్ ఉనద్కత్ రీ ఎంట్రీ క్రికెట్
    నాపై రెండుసార్లు హత్యాప్రయత్నం జరిగింది : మాజీ టెన్నిస్ స్టార్ క్రికెట్
    మైక్రో సాఫ్ట్ పై 60 మిలియన్ యూరోల జరిమానా విధించిన వాచ్ డాగ్ టెక్నాలజీ
    ఈ ఏడాది రోహిత్ శర్మ అట్టర్ ప్లాఫ్ షో క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025