Flydubai Attack: కెప్టెన్ స్మిత్‌కు తీవ్ర గాయాలు.. తలకు అత్యవసర శస్త్రచికిత్స
ఈ వార్తాకథనం ఏంటి
ప్రాణాంతక దాడి ఎదురైనా ప్రయాణికుల రక్షణకే ప్రాధాన్యం ఇచ్చారు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్. కోపైలట్ దాడి చేసిన సమయంలో ఆయన ప్రయాణికులను కాపాడేందుకు అతడితో తీవ్రంగా పోరాడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన స్మిత్ ప్రస్తుతం యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల, వీపుపై గొడ్డలితో దాడి కోపైలట్ గొడ్డలితో దాడి చేయడంతో కెప్టెన్ స్మిత్ తల, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పెద్దఎత్తున రక్తస్రావం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రిలో ఆయనకు వెంటనే అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించారు.
వివరాలు
మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
తొలి చికిత్స, శస్త్రచికిత్స అనంతరం కెప్టెన్ స్మిత్‌ను యూఏఈలోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు.
దాడి కారణంగా ఆయన చేతులు, కాళ్లు, ఛాతీ, పొత్తికడుపు పైభాగంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆరోగ్యం స్థిరం
కెప్టెన్ స్మిత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
రియాద్, జెడ్డాలోని భారత అధికారులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
మరోవైపు, చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు.