Loading...
Ankur Patel: భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత
భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత

Ankur Patel: భార్యపై అనుమానంతో దారుణ హత్య.. భారత్‌కు పారిపోతుండగా ఎయిర్‌పోర్టులో పట్టివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. భార్య తన మాజీ సహోద్యోగితో సన్నిహితంగా ఉంటోందనే అనుమానంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. అంతేకాకుండా, భార్యతో తరచూ గొడవలు జరగడంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పక్కా ప్రణాళికతో ఆమెను తన అపార్ట్‌మెంట్‌కు రప్పించి కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేశారు.

వివరాలు 

అసలేం జరిగిందంటే?

అమెరికాలోని షికాగోలో అంకుర్ పటేల్ తన 32 ఏళ్ల భార్యతో కలిసి నివసించేవాడు.

ఈ దంపతులకు ఓ చిన్న కుమార్తె కూడా ఉంది. అయితే, గత కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో విడివిడిగా ఉంటున్నారు.

ఈ క్రమంలో వారి కుమార్తె తండ్రి వద్ద ఉండగా, భార్య మరోచోట నివసిస్తోంది.

ఇదిలా ఉండగా, ఆమె తన మాజీ సహోద్యోగితో సన్నిహితంగా ఉంటున్నట్లు అంకుర్ పటేల్‌కు తెలిసింది.

తన నుంచి విడిపోయిన భార్య మరో వ్యక్తికి దగ్గరవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు.

దీంతో భార్యతో పాటు ఆమెతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తిని కూడా చంపేస్తానని పలుమార్లు బెదిరించాడు.

మరోవైపు, తన కుమార్తెతో మాట్లాడేందుకు కూడా భార్యను అనుమతించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి.

వివరాలు 

అసలేం జరిగిందంటే?

చివరకు భార్యను హత్య చేయాలని పటేల్ నిర్ణయించుకున్నాడు.

తన ప్రణాళికలో భాగంగా కుమార్తెను భారత్‌లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు పంపించాడు.

అనంతరం కూతురును చూడటానికి షికాగో రావాలని భార్యను కోరాడు. అయితే, తమ కుమార్తె అప్పటికే భారత్‌కు వెళ్లిపోయిన విషయం ఆమెకు తెలియదు.

దీంతో తన కొత్త భాగస్వామితో కలిసి ఆమె షికాగోలోని పటేల్ అపార్ట్‌మెంట్‌కు చేరుకుంది.

ఆమె భాగస్వామి కారులో బయటే వేచి ఉండగా, ఆమె ఒక్కతే అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లింది.

అక్కడ కుమార్తె కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురైంది. ఇదే సమయంలో అంకుర్ పటేల్ మరోసారి భార్య మనసు మార్చేందుకు ప్రయత్నించాడు.

తనతో రాజీపడి తిరిగి కలిసి జీవించాలని కోరాడు. అయితే, ఆమె అతడి ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది.

ADVERTISEMENT

వివరాలు 

ప్రియురాలు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో..

తాను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అతడితోనే ఉంటానని తేల్చిచెప్పింది.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పటేల్.. భార్య మెడపై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు.

అపార్ట్‌మెంట్‌ బయట కారులో వేచి ఉన్న ఆమె భాగస్వామి.. ఎంతసేపటికీ ఆమె తిరిగి రాకపోవడంతో ఫోన్ చేశాడు.

అయినప్పటికీ ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే, అతడికి అపార్ట్‌మెంట్ వివరాలు,ఫ్లాట్ నంబర్ కచ్చితంగా తెలియకపోవడంతో పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు.

మరోవైపు,ఆ రాత్రి అంకుర్ పటేల్‌ను కలవాల్సిన అతడి స్నేహితులు ఫోన్ చేసినా స్పందన రాకపోవడంతో అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు.

అక్కడ రక్తపు మడుగులో పడి ఉన్న అతడి భార్య మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రియురాలు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో..

అయితే, అప్పటికే అంకుర్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించాడు.

విమాన టికెట్ కొనుగోలు చేయాలని చూసినా, టికెట్ కౌంటర్ మూసివేయడంతో వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ తర్వాత నేరుగా ఇంటికి వెళ్లకుండా విమానాశ్రయానికి సమీపంలోని ఓ హోటల్‌లో బస చేశాడు.

హత్యకు ఉపయోగించిన కత్తిని పారవేసి, కొత్త దుస్తులు కొనుగోలు చేశాడు.

మరుసటి రోజు మళ్లీ విమానాశ్రయానికి వెళ్లి విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల అప్రమత్తతతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో భాగంగా తాను భార్యను హత్య చేయాలని మొదట అనుకోలేదని, ఆమె మరో వ్యక్తితో కలిసి జీవిస్తానని చెప్పడంతో ఆగ్రహానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడు.

ADVERTISEMENT