NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్
    తదుపరి వార్తా కథనం
    Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్

    Iran - Israel Tensions: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులు....మండిపడ్డ ఇజ్రాయెల్

    వ్రాసిన వారు Stalin
    Apr 14, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    యూదు దేశం ఇజ్రాయెల్ (Israel) పై ఇరాన్ (Iran) క్రూయిజ్, డ్రోన్ క్షిపణి దాడులతో విరుచుకుపడింది.

    ఇజ్రాయెల్ పై సుమారు 200 లకు పైగా క్షిపణులతో దాడి చేసింది.

    ఈ మేరకు ఇజ్రాయెల్ రక్షణ విభాగం అధికార ప్రతినిధి డానియెల్ హగరీ మీడియాకు వెల్లడించారు.

    ఉదయం రెండు గంటలకు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవా, జెరూసలేం, దిమోనా, ఇజ్రాయెల్ న్యూక్లియర్ రియాక్టర్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసిందన్నారు.

    ఆ క్షిపణుల్లో కొన్నింటిని ఐడీఎఫ్ ద్వారా అడ్డుకున్నట్లు హగరీ వెల్లడించారు.

    రెండు వారాల క్రితం సిరియా లోని కాన్సూలేట్ పై ఇజ్రాయెల్ దాడులు చేసి ఇరాన్ మేజర్ జనరల్ కమాండర్ మహమ్మద్ రెజా జహేదీతో సహా ఏడుగురు ఇరాన్ దేశీయులను హతమార్చింది.

    Iran attacks

    ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్

    ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్పట్నుంచి ప్రతీకారంతో రగిలిపోతోంది.

    గత కొద్ది నెలలుగా సిరియాలోని ఇరాన్ కు మద్దతిచ్చే శక్తులమీద లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది.

    అందులోభాగంగానే సిరియాలోని డెమాస్కస్ లోని కాన్సూలేట్ కార్యాలయంపై ఈ నెల 1న ఇజ్రాయెల్ దాడి చేసింది.

    ఆక్రమిత గోలన్ హైట్స్ , నెగెవ్ ఎడారిలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.

    ఇరాన్ నుంచి అనేక డ్రోన్ క్షిపణులు ఇరాక్ గగనతలంపై నుంచి ఇజ్రాయెల్ పైకి వస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

    ఇజ్రాయెల్ పై దాడిలో యెమెన్ లోని హౌతీ మిలీషియా, లెబనాన్ లోని హిజ్బుల్లా కూడా చేరినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.

    Isral reaction

    దాడులపై మండిపడ్డ ఇజ్రాయెల్

    ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్స్ప్ వెల్లడించింది.

    నేరాలకు పాల్పడుతున్న జియోనిస్ట్ దేశంపై ఇది ప్రతీకారచర్యగా ఇరాన్ ఈ దాడులను అభివర్ణించింది.

    క్షిపణి దాడిలో నెగెవ్ లోని ఓ బాలిక , కొందరు గాయపడగా మరికొన్ని భవనాలు దెబ్బతిన్నాయి.

    డెమాస్కస్ పై దాడికి ప్రతీకారంగానే తాము క్షిపణి దాడులకు పాల్పడినట్లు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    తాము చేసిన దాడులపై ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించింది.

    ఈ దాడులపై ఇజ్రాయెల్ లేదా అమెరికా తమ దేశంపై దాడికి దిగే అవకాశముందని కూడా తెలిపింది.

    కాగా, ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్
    ఇరాన్
    ఇరాక్

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    ఇజ్రాయెల్

    Israeli Hamas war : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి- హాస్పిటల్ కింద హమాస్ స్థావరం హమాస్
    Trudeau-Netanyahu: గాజాలో శిశువులను చంపడం ఆపండి: కెనడా ప్రధాని ట్రూడో  బెంజమిన్ నెతన్యాహు
    UNO : భద్రతా మండలిలో అత్యవసర తీర్మానం ఆమోదం.. గాజాలో మానవతావాద కాల్పుల విరమణ ఐక్యరాజ్య సమితి
    ISRAEL : గాజాలోని అల్ షిఫా ఆస్పత్రిలో ఆయుధాలు లభ్యం.. ఇజ్రాయెల్ దళాల గాలింపులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

    ఇరాన్

    హిజాబ్ ఆందోళనల్లో పాల్గొన్న మరో ముగ్గురికి ఉరి ప్రపంచం
    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    50పైగా పాఠాశాలల్లో బాలికలపై విష ప్రయోగం విద్యార్థులు
    మహిళల అణచివేతపై గళం విప్పిన పోరాటయోధురాలికి నోబెల్ శాంతి బహుమతి ఇండియా

    ఇరాక్

    సిరియాలో టెర్రర్ దాడులు.. ఘర్షణల్లో మరణించిన ఐఎస్ఐఎస్ చీఫ్ ఖురాషీ  సిరియా
    ఉత్తర ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం..  113మందిమృతి, 150 మందికి గాయాలు  అగ్నిప్రమాదం
    గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు  హమాస్
    US strikes: అమెరికా ప్రతీకార దాడులు.. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌ మిలిటెంట్లపై బాంబుల వర్షం అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025