NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!
    తదుపరి వార్తా కథనం
    దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!
    సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత

    దక్షిణ కొరియాలో సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధం ఎత్తివేత.. పిల్లల ఆకారంలోని డాల్స్ పై మాత్రం..!!

    వ్రాసిన వారు Stalin
    Dec 28, 2022
    03:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్స్ బొమ్మల దిగుమతిపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

    నిషేధాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సెక్స్ డాల్స్ దిగుమతిని నిషేధించే చట్టం దక్షిణ కొరియాలో లేకపోయినా.. తమ వ్యక్తిగత జీవితాల్లో ప్రభుత్వం ఎందుకు జ్యోక్యం చేసుకుంటోందని విమర్శంచారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది.

    ఇదిలా ఉంటే.. విమర్శలపై కస్టమ్స్ అధికారులు స్పందించారు. సెక్స్ డాల్స్ దిగుమతిని నిషేధించే చట్టం దేశంలో లేకపోయినా.. నైతిక బాధ్యతతోనే సెక్స్ బొమ్మలను అనుమతించలేదని చెప్పారు.

    దక్షిణ కొరియా

    స్వాగతించిన వ్యాపారులు

    నిషేధం అమల్లో ఉన్న సమయంలో స్వాధీనం చేసుకున్న సెక్స్ డాల్స్‌ను తిరిగి దిగుమతిదారులకు అప్పజెప్పాలని ఈ సందర్భంగా అధికారులను దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదేశించింది. అయితే పిల్లల ఆకారాల్లో ఉన్న సెక్స్ బొమ్మలపై మాత్రం నిషధం కొనసాగుతుందని చెప్పింది. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే లాంటి దేశాలు కూడా పిల్లల ఆకారంలో ఉన్న సెక్స్ బొమ్మలను నిషేధించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

    నిషేధాన్ని ఎత్తివేయడాన్ని.. సెక్స్ డాల్స్‌ వ్యాపారులు స్వాగతిస్తున్నారు. ఇది సహేతుకమైన నిర్ణయం అంటూ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. లైంగికంగా దూరమైన వ్యక్తులకు ఇది ఊరటనిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

    దక్షిణ కొరియా సంప్రదాయాలకు విరద్ధంగా భావించే.. సెక్స్ బొమ్మల నిషేధంపై కస్టమ్స్ అధికారులు, దిగుమతిదారుల మధ్య చాలా కాలంగా సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దక్షిణ కొరియా

    తాజా

    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు
    Harihara Veeramallu : వాయిదా పడిన హరిహర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్‌! హరిహర వీరమల్లు
    AP News: రేషన్‌ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!  ఆంధ్రప్రదేశ్

    దక్షిణ కొరియా

    'మెదడు తినే అమీబా'తో దక్షిణ కొరియాలో తొలి మరణం.. ప్రపంచ దేశాలు అలర్ట్ ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025