LOADING...
Donald Trump: నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్
నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్

Donald Trump: నాపై వచ్చిన వార్తలే ఎక్కువగా చదువుతాను: ఉషా వాన్స్ పాడ్‌కాస్ట్‌లో ట్రంప్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తనకు తీరిక దొరికినప్పుడు వార్తాపత్రికలు చదవడం అలవాటని, ముఖ్యంగా తనకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు చదవడానికే ఎక్కువ ఆసక్తి చూపుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి ఉషా వాన్స్ నిర్వహిస్తున్న 'స్టోరీ టైమ్ విత్ సెకండ్ లేడీ' పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన, పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్ హిస్టారికల్ అసోసియేషన్ ప్రచురించిన 'ప్రెసిడెంట్స్ ప్లే!' పుస్తకంలోని కొన్ని భాగాలను ట్రంప్ స్వయంగా చదివి వినిపించారు. ఆ పుస్తకంలో అమెరికా మాజీ అధ్యక్షులు తమ విశ్రాంతి సమయంలో అనుసరించిన అలవాట్లు, అభిరుచుల గురించి ప్రస్తావన ఉందని చెప్పారు. అలాగే వైట్‌హౌస్ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న కొత్త బాల్‌రూమ్ గురించి కూడా ఆయన వివరించారు.

వివరాలు

వైట్ హౌస్‌లో ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ ఇంటర్వ్యూ..

అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 4న ఉషా వాన్స్ ఈ పాడ్‌కాస్ట్ వీడియోను ఎక్స్ వేదికలో విడుదల చేశారు. పాడ్‌కాస్ట్‌లో భాగంగా, 'ప్రెసిడెంట్స్ ప్లే!' పుస్తకంలో ఉన్న ఒక చిత్రాన్ని ట్రంప్ ప్రస్తావించారు. అందులో ఒక అమెరికా అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో కూర్చుని సూపర్‌బౌల్ ఫుట్‌ బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న దృశ్యం కనిపిస్తుంది. ఆ ఫొటోను చూపిస్తూ ట్రంప్ సరదాగా స్పందించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కలిసి వీక్షించేందుకు బరాక్ ఒబామా, జో బైడెన్, బుష్ కుటుంబ సభ్యులను ఆహ్వానిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. అలా జరిగితే అది మాజీ అధ్యక్షుల రీయూనియన్‌లా మారుతుందని, మీడియా కూడా దానిపై పెద్ద ఎత్తున చర్చించే అవకాశముందని వ్యాఖ్యానించారు.

వివరాలు

బిల్ క్లింటన్‌పై ప్రశంసల వెల్లువ..

ఈ సందర్భంగా గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు విశ్రాంతి సమయంలో ఎలా గడిపేవారో కూడా ట్రంప్ వివరించారు. సాధారణంగా ఒక అధ్యక్షుడు వైట్‌హౌస్‌లో గడిపే సమయం చాలా పరిమితమని, ప్రజల సేవ కోసం పని చేసే అవకాశం దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తామని ఆయన అన్నారు. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాగింగ్ ట్రాక్‌పై క్రమం తప్పకుండా పరుగులు తీసేవారని, ఈ విషయం తనకు ఇటీవలే తెలిసిందని ట్రంప్ పేర్కొన్నారు. తాను మాత్రం అలాంటి అలవాటు పాటించలేనేమోనని నవ్వుతూ చెప్పారు. అదే సమయంలో బిల్ క్లింటన్ మంచి వ్యక్తి అని, ఆయనపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని ట్రంప్ ప్రశంసించారు.

Advertisement