Page Loader
లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ
ఛాలెంజర్ 1970లలో డాడ్జ్ సిరీస్ లో పేరుపొందిన మోడల్

లిమిటెడ్ ఎడిషన్ 2023 ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ కారును ప్రదర్శించిన డాడ్జ్ సంస్థ

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 13, 2023
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రసిద్ద US తయారీ సంస్థ డాడ్జ్ చికాగో ఆటో షోలో "లాస్ట్ కాల్" స్పెషల్-ఎడిషన్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను ప్రదర్శించింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా కేవలం 300 యూనిట్లకు పరిమితం చేయనున్నారు. ముందు మోడల్ '426 HEMI' V8 ఇంజిన్‌ను ఉపయోగించి గాడ్‌ఫ్రే క్వాల్స్ 1970 డాడ్జ్ ఛాలెంజర్ R/T SE మోడల్‌ లాగా ఉంది ఈ కారు. ఛాలెంజర్ 1970లలో వచ్చినప్పటి నుండి డాడ్జ్ సిరీస్ లో పేరుపొందిన మోడల్. ఈ కారు ప్రధానంగా దాని శక్తివంతమైన 5.2-లీటర్ V8 ఇంజిన్‌ తో పేరు సంపాదించుకుంది, దీనిని అప్పట్లో వివిధ రేసింగ్ ఈవెంట్‌లలో ఉపయోగించేవారు. బ్లాక్ ఘోస్ట్ డెట్రాయిట్ వుడ్‌వార్డ్ అవెన్యూ ప్రాంతానికి చెందిన గాడ్‌ఫ్రే క్వాల్స్‌కు చెందినది.

కార్

2023 డాడ్జ్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ లోపల ప్రత్యేక 'బ్లాక్ ఘోస్ట్' బ్యాడ్జ్‌ ఉంటుంది

2023 డాడ్జ్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్ శక్తివంతమైన 6.2-లీటర్ HEMI V8 ఇంజన్‌తో నడుస్తుంది. 1970ల కాలం నాటి డిజైన్‌కు అనుగుణంగా, ఇది ఒక ప్రత్యేకమైన గేటర్-స్కిన్ వినైల్ రూఫ్‌ తో వస్తుంది. లోపల టెక్-ఫార్వర్డ్ 4 సీటర్ క్యాబిన్‌, డ్యాష్‌బోర్డ్, డోర్ ట్రిమ్స్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, రెడ్ కార్బన్ ఫైబర్ బెజెల్స్, స్వెడ్ హెడ్‌లైనర్ తో పాటు ప్రత్యేక 'బ్లాక్ ఘోస్ట్' బ్యాడ్జ్‌ ఉంటుంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టివిటీ ఆప్షన్‌లకు సపోర్ట్‌తో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ కూడా వస్తాయి. పరిమిత-ఎడిషన్ 2023 డాడ్జ్ ఛాలెంజర్ బ్లాక్ ఘోస్ట్‌ను రెగ్యులర్ మోడల్ నుండి వేరు చేయడానికి, ఇది ప్రత్యేక 'పిచ్ బ్లాక్' కలర్ లో వస్తుంది.