ఏఎన్‌సీ బోట్ హెడ్‌ఫోన్స్ వచ్చేశాయి: వంద గంటల వరకు బ్యాటరీ లైఫ్
దేశీయ బ్రాండ్ బోట్ కొత్తగా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ పీఛర్ తో హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. బోట్ రాకర్జ్ 551 ఏఎన్‌సీ మోడల్ తో సరికొత్తగా ముందుకొచ్చింది. ఈ హెడ్ ఫోన్స్ ఫుల్ చార్జ్ చేస్తే 100 గంటల వరకు ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ హెడ్ ఫోన్స్ ధర, సేల్, స్పెసిఫికేషన్లు, ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏఎన్‌సీ ఏనేబుల్ చేసుకుంటే పరిసరాల శబ్దాలు రాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ బయట శబ్దాలను ఎక్కువగా వినాలనుకుంటే యాంబిమెంట్ మోడ్ కూడా ఉండడం విశేషం. 10 నిమిషాల చార్జింగ్ తో 10 గంటల పాటు వినియోగించుకునేలా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 551 ఏఎన్ సీ హెచ్ ఫోన్స్ కూడా వచ్చాయి.
ఈ హెడ్ ఫోన్స్ ధర రూ.2999
సిగ్నేచర్ సౌండ్తో కూడిన 40 మిల్లీమీటర్ల సౌండ్ డ్రైవర్లను, బోట్ రాకర్జ్ 551 ఏఎన్‌సీ వైర్‌లెస్ బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ను కలిగి ఉన్నాయి. చార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-'సీ పోర్టు కూడా ఉంది. హెడ్ ఫోన్స్ ఉండే బటన్స్ తో మ్యూజిక్ ప్లే బ్లాక్, కాల్స్, వాయిస్ అసిస్టెంట్ లను యూజర్లు కంట్రోల్ చేసుకోవచ్చు. వీటి ధర రూ.2999 గా ఉండనుంది. ఇవి స్టెల్లర్ బ్లాక్, సేగ్ గ్రీన్ కలర్లలో రానుంది.