Page Loader
కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక
సిట్రోయెన్ C3 ప్లస్ డిజైన్ భారతదేశంలో రూపొందింది

కియా కేరెన్స్‌కి Vs సిట్రోయెన్ C3 ప్లస్ ఏది సరైన ఎంపిక

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 29, 2023
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ తన C3-ఆధారిత SUVని ఏప్రిల్ 27న విడుదల చేయనుంది. ఈ కారు డిజైన్ పూర్తిగా భారతదేశంలోనే రూపొందించారు. మార్కెట్లో ఇది కియా కేరెన్స్‌తో పోటీ పడుతుంది. సిట్రోయెన్ C3 ప్లస్ లో ఆటో క్లైమేట్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్‌లు, రివర్స్-వ్యూ కెమెరా, బ్లూటూత్ కనెక్టివిటీ, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ఆటో-డిమ్మింగ్ IRVM, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, మల్టీఫంక్షనల్ ఉన్నాయి. కియా కారెన్స్ లో మినిమలిస్ట్ డ్యాష్‌బోర్డ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, సన్‌రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్‌ ఉన్నాయి.

కార్

కియా కారెన్స్ సిట్రోయెన్ C3 కారు కన్నా పొడుగ్గా ఉంటుంది

సిట్రోయెన్ C3-ఆధారిత SUV సుమారు 4,200mm పొడవు, దాదాపు 2,540mm వీల్‌బేస్ ఉంటుంది. అదే సమయంలో, కియా కారెన్స్ పొడవు 4,540mm, వీల్‌బేస్ 2,780mm ఉంటుంది. సిట్రోయెన్ C3 కారు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. కారెన్స్ 1.5-లీటర్ డీజిల్ , 1.5-లీటర్ పెట్రోల్ మిల్లు 1.4-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ తో నడుస్తుంది. భారతదేశంలో, Citroen C3-ఆధారిత SUV ధర దాదాపు రూ.10 లక్షలు నుండి 15 లక్షలు ఉంది. కియా కారెన్స్ ధర రూ.10.45 లక్షలు నుండి రూ.18.95 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ఉంది.