Ducati: బ్లాక్ లుక్‌లో డ్యుకాటీ మాన్‌స్టర్.. V2 ఇంజిన్‌తో కొత్త బైక్
ఈ వార్తాకథనం ఏంటి
ఆటో మొబైల్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డ్యుకాటీ మాన్‌స్టర్ సిరీస్‌లోకి మరో కొత్త వేరియంట్ చేరింది. అదే మాన్‌స్టర్ డార్క్. స్టాండర్డ్ మాన్‌స్టర్ ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌లో ప్రధానంగా డిజైన్ మార్పులు చేశారు. దాదాపు అన్ని బాడీ ప్యానెల్స్, కీలక భాగాలకు నలుపు రంగు ఇచ్చారు. దీంతో సాధారణ మోడల్‌తో పోలిస్తే ఇది మరింత భిన్నంగా కనిపిస్తుంది. అయితే, ఈ కొత్త వేరియంట్ కేవలం రూపంలోనే ప్రత్యేకతను చూపిస్తోంది. ఇంజిన్, పనితీరు, మెకానికల్ విభాగాల్లో మాత్రం స్టాండర్డ్ మోడల్ స్పెసిఫికేషన్లనే కొనసాగించింది.
Details
చిన్న మార్పులతో ఆకట్టుకునే డిజైన్
మాన్‌స్టర్ డార్క్ బైక్‌ను పూర్తిగా నలుపు రంగులో తీర్చిదిద్దినా, కొన్ని చిన్న వివరాలతో ప్రత్యేకత తీసుకొచ్చారు.
ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా గ్రే రంగులో డ్యుకాటీ, మాన్‌స్టర్ అక్షరాలు కనిపిస్తాయి. హెడ్‌లైట్ కౌల్‌పై ఎరుపు రంగు డ్యుకాటీ లోగో, వెనుకవైపు పసుపు రంగు మోనోషాక్ బైక్ రూపానికి కాంట్రాస్ట్ ఇస్తాయి.
బ్లాక్ వీల్స్, డార్క్ ఎగ్జాస్ట్ ఎండ్ క్యాప్స్, సింగిల్ మెటీరియల్ సీట్ డిజైన్‌ను పూర్తిచేస్తాయి. ముందు ఫ్రేమ్‌లోని కొన్ని భాగాలకు పెయింట్ వేయకుండా ఉంచడం మరో ప్రత్యేకత.
Details
890 సీసీ V2 ఇంజిన్.. 111 హెచ్‌పీ పవర్
ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 890 సీసీ V2 ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 9,000 ఆర్‌పీఎం వద్ద 111 హెచ్‌పీ పవర్, 7,250 ఆర్‌పీఎం వద్ద 91.1 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
90 డిగ్రీల V2 ఇంజిన్‌లో డ్యుకాటీ ఇంటేక్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్ సిస్టమ్‌ను అందించింది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్ జత చేశారు.
రైడింగ్ అనుభవాన్ని బట్టి నాలుగు రైడింగ్ మోడ్స్ ఎంచుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, బాష్ కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఎలక్ట్రానిక్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
Details
బ్రేకింగ్, సస్పెన్షన్.. ఇతర వివరాలు
హార్డ్‌వేర్ విభాగంలో ముందు భాగంలో 43 ఎంఎం షోవా అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుకవైపు అడ్జస్టబుల్ ప్రీలోడ్ కలిగిన మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చారు.
బ్రేకింగ్ కోసం ముందు చక్రానికి బ్రెంబో M4.32 ఫోర్ పిస్టన్ కాలిపర్స్ అమర్చారు. 5 అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌గా పనిచేస్తుంది.
ఇంధనం మినహా ఈ బైక్ బరువు 175 కిలోలు కాగా, సీట్ ఎత్తు 815 మిల్లీమీటర్లు. అంటే బైక్ పనితీరుతో పాటు రైడర్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన హార్డ్‌వేర్‌ను అందించారు.
Details
నవంబర్‌లో అంతర్జాతీయ డెలివరీలు.. భారత్‌కు ఎప్పుడంటే?
డ్యుకాటీ మాన్‌స్టర్ డార్క్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేసింది. 2026 నవంబర్ నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
అయితే, భారత మార్కెట్‌లో ఈ బైక్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
కొన్ని నివేదికల ప్రకారం 2027లో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో మాన్‌స్టర్ సిరీస్ ధరలు రూ.13.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతున్నాయి. డార్క్ వేరియంట్ భారత ధరను మాత్రం డ్యుకాటీ ప్రకటించాల్సి ఉంది.